టార్గెట్ కేసీఆర్‌‌: బీజేపీ అస్త్రమిదే

Published : Jul 26, 2019, 07:08 AM ISTUpdated : Jul 26, 2019, 07:15 AM IST

తెలంగాణలో రాజకీయంగా బలోపేతం కావడానికి బీజేపీ అన్ని రకాల అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తోంది. టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకొని విస్తృతంగా ప్రచారం చేయనుంది.

PREV
19
టార్గెట్ కేసీఆర్‌‌: బీజేపీ అస్త్రమిదే
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. ఎంఐఎంకు టీఆర్ఎస్ ఎలా సహకరిస్తోందోననే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది

29
.ఇటీవల కాలంలో ఎంఐఎం నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసినా కూడ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోని విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

39
తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం టీఆర్ఎస్ లు మిత్రపక్షంగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడ ఈ రెండు పార్టీలు మిత్రులుగానే ఉన్నాయి.దేశంలో రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామని ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

49
మూడు రోజుల క్రితం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ముస్లింలకు రిజర్వేషన్ల బిల్లును ఉపసంహరించుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది బీజేపీ.

59
టీఆర్ఎస్ ఎంఐఎం రాజకీయాలతో రాజకీయంగా తమ పార్టీ బలోపేతమయ్యేందుకు ఉపయోగపడుతాయని కాషాయదళం భావిస్తోంది. ఈ రెండు పార్టీలు అనుసరిస్తున్న విధానాలను ప్రజలు అర్ధం చేసుకొంటున్నారని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

69
కేసీఆర్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా ఏ రకంగా వ్యవహరిస్తుందో ప్రజలు అర్ధం చేసుకొంటున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామచంద్రారావు అభిప్రాయపడ్డారు.

79
ఎంఐఎం టీఆర్ఎస్ మైత్రితో రాష్ట్రంలో సాగుతున్న పాలనపై ప్రజలు విసుగు చెందారని రామచంద్రారావు చెప్పారు. రాజకీయంగా లబ్ది పొందేందుకు ఎంఐఎం ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకొంటుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అభిప్రాయపడ్డారు.

89
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడ తెలంగాణపై కేంద్రీకరించింది. బీజేపీ నేతలు ప్రస్తుతం సభ్యత్వ నమోదుపై కేంద్రీకరించారు.

99
రానున్న రోజుల్లో తెలంగాణకు చెందిన పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు.ఇప్పటికే ఆయా పార్టీల నేతలతో బీజేపీ నాయకత్వం చర్చలు జరిపింది.

click me!

Recommended Stories