మరో విషయం ఏంటంటే ఇప్పుడు వాట్సాప్‌లో ప్రకటనలు కూడా కనిపిస్తాయి. ఈ విషయాన్ని వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ (Will Cathcart)వెల్లడించారు. బ్రెజిలియన్ మీడియా హౌస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, విల్ క్యాత్‌కార్ట్ వాట్సాప్‌లో ప్రకటనలు కనిపిస్తాయని, కానీ మెయిన్ ఇన్‌బాక్స్ చాట్‌లో కనిపించవని చెప్పారు. యాప్‌లోని రెండు విభాగాలలో ప్రకటనలు కనిపిస్తాయి, అయితే ఈ విభాగాలు ఏవో చెప్పలేదు.