ఈ సిరీస్ ఫోన్లలో ట్రిపుల్ బ్యాక్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇంకా డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఉంది. డిస్ ప్లే కోసం అల్ట్రా స్లిమ్ 3డి కర్వ్డ్, MediaTek Dimension 1200 ప్రాసెసర్‌ని ఫోన్‌లో అందించారు.
ర్యామ్ అండ్ స్టోరేజ్
ఈ సిరీస్ లోని వివో వి23 5జి 8జిబి ర్యామ్‌తో 128జిబి స్టోరేజ్ ధర రూ. 29,990, 256GB స్టోరేజ్‌తో 12GB RAM ధర రూ. 34,990. వివో వి23 ప్రొ 5G 8జిబి ర్యామ్‌తో 128జిబి స్టోరేజ్ ధర రూ. 38,990, 256జిబి స్టోరేజ్‌తో 12 GB RAM ధర రూ. 43,990. రెండు ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ నుండి విక్రయించనున్నారు ఇంకా ప్రీ-బుకింగ్ కూడా ప్రారంభమయ్యాయి. వివో వి23 ప్రొ 5G సేల్స్ జనవరి 19 నుండి వివో వి23 5G జనవరి 13 నుండి ప్రారంభమవుతాయి