బ్లూటూత్ కాలింగ్‌తో సరికొత్త స్మార్ట్‌వాచ్.. పాకెట్ ధరకే అందుబాటులోకి.. బెస్ట్ ఫీచర్స్ ఇవే..

First Published | Jan 5, 2022, 2:50 PM IST

ఇండియన్ బ్రాండ్ పోర్టోనిక్స్(portronics) స్మార్ట్ కాలింగ్ ఫీచర్‌తో వస్తున్న క్రోనోస్ వై1 స్మార్ట్‌వాచ్ రేంజ్ లో మరో అద్భుతమైన స్మార్ట్‌వాచ్‌(smartwatch)ను భారతదేశంలో విడుదల చేసింది. మీరు స్మార్ట్‌వాచ్‌లను ఇష్టపడేవారైతే  లేదా కొత్త స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే క్రోనోస్ వై1 (Kronos Y1)మీకు మంచి ఆప్షన్.

ఈ కొత్త స్మార్ట్ వాచ్ ఎన్నో ఫిట్‌నెస్ ఫీచర్లతో వస్తుంది. దీనితో మీరు మీ డైలీ వర్క్ ఔట్స్ మాత్రమే కాకుండా  ఇతర విషయాలపై కూడా నిఘా ఉంచవచ్చు.

 పోర్టోనిక్స్ నుండి కొత్త క్రోనోస్ వై1 స్మార్ట్‌వాచ్ 1.75-అంగుళాల హెచ్‌డి డైనమిక్ డిస్‌ప్లే, సాఫ్ట్ సిలికాన్ పట్టీతో వస్తుంది. దీనిలో కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0 వెర్షన్‌ ఉంది. ఇంకా బ్లూటూత్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది. మీ ఫోన్‌లోని అన్ని సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు కూడా ఆటోమేటిక్‌గా మీ స్మార్ట్‌వాచ్‌లో చూపిస్తుంది.


ఈ స్మార్ట్‌వాచ్ సహాయంతో బ్లెడ్ ప్రేజర్ (bp), హార్ట్ బీట్ రేటుతో పాటు మీరు  ఆక్సిజన్ లెవెల్స్ (SPO2) అంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కూడా పర్యవేక్షించవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌వాచ్ ఎన్నో స్పోర్ట్స్ మోడ్‌లతో కూడా వస్తుంది, కాబట్టి మీరు స్లీప్ మానిటరింగ్, వాకింగ్, రన్నింగ్ మొదలైన వాటి ద్వారా మీ ఫిట్‌నెస్ టార్గెట్స్ సాధించవచ్చు. 
 

ఈ వాచ్ వాటర్ రెసిస్టెంట్ కోసం IP67 రేటింగ్ పొందింది, కాబట్టి మీరు  దీనిని ధరించి స్విమ్మింగ్ కూడా చేయవచ్చు. అకస్మాత్తుగా వాచ్ నీటిలో పడ్డ పాడైపోతుందని చింతించాల్సిన అవసరం లేదు. పోర్టోనిక్స్ నుండి వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ 200 పైగా కస్టమైజబుల్ వాచ్ ఫేస్‌లతో వస్తుంది.
 

దీనిలో ఇంటర్నల్ మ్యూజిక్ కంట్రోలర్‌ కూడా ఉంది, తద్వారా మీకు నచ్చిన మ్యూజిక్ మీకు కావలసినప్పుడు ఆస్వాదించవచ్చు. అన్ని కంట్రోల్స్ స్మార్ట్ వాచ్ స్క్రీన్‌పై ఉంటాయి. Portonyx Kronos Y1 స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ నుండి బ్లాక్ అండ్ గ్రే కలర్స్‌లో 12 నెలల వారంటీతో రూ. 3,399 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Latest Videos

click me!