స్టీఫెన్ హాకింగ్ 80వ బర్త్ డే: స్పెషల్ డూడుల్‌తో విశ్వ శాస్త్రవేత్తకు నివాళులర్పించిన గూగుల్..

First Published | Jan 8, 2022, 12:10 PM IST

న్యూఢిల్లీ: థియోరేటికల్  భౌతిక శాస్త్రవేత్త( theoretical physicist) స్టీఫెన్ హాకింగ్ (Stephen Hawking)కు తన 80వ జయంతి సందర్భంగా గూగుల్(google) శనివారం జనవరి 8, 2022న  ప్రత్యేక డూడుల్‌ వీడియోతో నివాళులు ఆర్పించింది. 

"ఈ రోజు  చరిత్రలోని అత్యంత ప్రభావవంతమైన సైంటిఫిక్ మైండ్స్ లో  ఒకరైన ఇంగ్లిష్ కాస్మోలోజిస్ట్, రచయిత అండ్ థియోరేటికల్  భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌ డూడుల్ వీడియో సెలెబ్రేషన్స్ జరుపుకుంటుంది" అని గూగుల్ తెలిపింది.

"బ్లాక్ హోల్స్ ఢీకొనడం నుండి బిగ్ బ్యాంగ్ వరకు, విశ్వం మూలాలు ఇంకా మెకానిక్స్‌పై అతని సిద్ధాంతాలు ఆధునిక భౌతిక శాస్త్రాన్ని విప్లవాత్మకంగా మార్చాయి, అయితే అత్యధికంగా అమ్ముడైన అతని పుస్తకాలు ఈ రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది పాఠకులకు విస్తృతంగా అందుబాటులోకి తెచ్చాయి" అని టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది.
 

ఈ డూడుల్‌లో స్టీఫెన్ హాకింగ్ స్వరం కూడా రూపొందించి ఉపయోగించారు. గూగుల్ అండ్ ఆల్ఫాబెట్  సి‌ఈ‌ఓ అయిన సుందర్ పిచాయ్ కూడా 2:31 నిమిషాల నిడివి గల క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు.


స్టీఫెన్ విలియం హాకింగ్ 1942లో ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో నేడు జన్మించారు. అతను ముఖ్యంగా విశ్వం ఎలా పనిచేస్తుందో చిన్నప్పటి నుండి ఆకర్షితుడయ్యాడు. అతని ఉత్సుకత, తెలివితేటలు అతనికి 'ఐన్‌స్టీన్' అనే మారుపేరును కూడా తెచ్చిపెట్టాయి.
 

Latest Videos


అయితే స్టీఫెన్ హాకింగ్ 21 సంవత్సరాల వయస్సులో న్యూరోడెజెనరేటివ్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది, దాని తర్వాత అతను తన జీవితాన్ని భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, కోస్మోలజికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు.  

1965లో అతను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో "ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్‌పాండింగ్ యూనివర్సెస్"లో తన డాక్టరల్ థీసిస్‌ను సమర్థించాడు,  అలాగే స్పేస్ అండ్ టైం ఏకత్వం నుండి ఉద్భవించిందని రివొల్యూషనరీ థియరీ అందించాడు.   
 

బ్లాక్ హోల్స్‌పై స్టీఫెన్ హాకింగ్‌కు ఉన్న అబ్సెషన్ కారణంగా కణాలు బ్లాక్ హోల్స్ నుండి తప్పించుకోగలవని 1974లో కనుగొన్నాడు. 

1979లో బ్లాక్ హోల్స్‌పై అతని సంచలనాత్మక కృషి స్టీఫెన్ హాకింగ్‌ను 1669లో ఐసాక్ న్యూటన్  నిర్వహించిన లూకాసియన్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్‌గా నియమించడానికి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాన్ని ప్రేరేపించింది. 

1988లో "ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్" ప్రచురణ తర్వాత స్టీఫెన్ హాకింగ్ అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. తరువాత  మార్చి 2018లో స్టీఫెన్ హాకింగ్‌ తన 76వ ఏట మరణించారు.
 

click me!