ఆపిల్ ఐఫోన్‌కి పోటీగా ప్రో గ్రేడ్ కెమెరాతో శామ్‌సంగ్ కొత్త 5జి స్మార్ట్ ఫోన్.. ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో..

First Published | Jan 4, 2022, 12:07 PM IST

 చాలా లీక్‌ల తర్వాత ఎలక్ట్రానిక్స్(electronics) తయారీ సంస్థ శామ్‌సంగ్(samsung) చివరకు  శామ్‌సంగ్  గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జి(Samsung Galaxy S21 FE 5G)ని విడుదల చేసింది.  అయితే అనుకున్నట్టుగానే గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జిని ప్రీమియం ఫీచర్లతో పరిచయం చేసింది. ఫోన్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే  ప్రో గ్రేడ్ కెమెరా కూడా ఉంది.

ఈ 5జి స్మార్ట్ ఫోన్ ని  ప్రస్తుతం యూ‌ఎస్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇతర మార్కెట్లలో దీని లభ్యత గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ గత సంవత్సరం ప్రారంభించిన గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్. ధర పరంగా ఈ కొత్త శామ్‌సంగ్ ఫోన్ ఐఫోన్ 12 (iPhone 12) సిరీస్‌తో పోటీపడుతుంది.

శామ్‌సంగ్  గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జి ధర
ఈ స్మార్ట్ ఫోన్ ని రెండు వేరియంట్లలో పరిచయం చేశారు. ఫోన్ 6జి‌బి ర్యామ్ 128జి‌బి స్టోరేజ్ ధర  699 డాలర్లు అంటే దాదాపు రూ. 52,000. 8జి‌బి ర్యామ్ ఉన్న 256జి‌బి స్టోరేజ్ ధర  769 డాలర్లు అంటే దాదాపు రూ. 57,346. దీనిని  వైట్, గ్రాఫైట్, లావెండర్ అండ్ ఆలివ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. దీని సేల్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది.


స్పెసిఫికేషన్‌లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత One UI 4ని Galaxy S21 FE 5Gలో అందించారు. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేటుతో 6.4-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్ ప్లే5 ఉంది. ఫోన్ గరిష్టంగా 8జి‌బి ర్యామ్ తో 256జి‌బి వరకు స్టోరేజ్ పొందుతుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది.
 

కెమెరా
కెమెరా గురించి మాట్లాడితే  ఈ శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, మొదటి లెన్స్ 12 మెగాపిక్సెల్‌ అల్ట్రావైడ్, రెండవ లెన్స్ 12 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్, మూడవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ టెలిఫోటో లెన్స్, దీనితో 30x ఆప్టికల్ జూమ్ అందుబాటులో ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
 

బ్యాటరీ
ఈ శామ్‌సంగ్ ఫోన్ లో 4500mAh బ్యాటరీతో 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అంటే వైర్‌లెస్ పవర్‌షేర్‌తో కూడా వస్తుంది. కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 5G, 4G, Samsung Pay, NFC, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. వాటర్ రెసిస్టెంట్ కోసం ఫోన్ IP68 రేటింగ్ పొందింది.
 

Latest Videos

click me!