జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్: ఇప్పుడు ఫుడ్ డెలివరీలపై, రెస్టారెంట్లలో సూపర్ అఫర్.. మిస్సవకండి..

Ashok Kumar | Published : Nov 11, 2023 11:57 AM
Google News Follow Us

దేశీయ టెలికాం రిలయన్స్ జియో ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌తో స్విగ్గీ వన్ లైట్‌ని ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌తో అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ధర  రూ. 866. ఈ ప్లాన్ జియో వినియోగదారులకు పండుగ సీజన్‌లో ఫుడ్ డెలివరీలపై బెనిఫిట్స్ అందించడం కోసం  తీసుకొచ్చారు.
 

14
 జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్: ఇప్పుడు ఫుడ్ డెలివరీలపై, రెస్టారెంట్లలో సూపర్ అఫర్.. మిస్సవకండి..

జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌

ఈ ప్లాన్‌తో మీరు 2GB డైలీ డేటా, ఆన్ లిమిటెడ్  వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, ఆన్ లిమిటెడ్  5G డేటా పొందుతారు. ఈ జియో వెల్‌కమ్ ఆఫర్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ప్లాన్ బెనిఫిట్ ఏమిటంటే  3 నెలల ఉచిత Swiggy One Lite సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. జియో యూజర్లు  JioTV, JioCinema, JioCloudకి కూడా యాక్సెస్ పొందుతారు.

దీనితో పాటు రూ. 50 క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందుతారు, దీనిని రూ. 866 ప్లాన్  నెక్స్ట్ రీఛార్జ్‌లో రీడీమ్ చేసుకోవచ్చు.

24
Biryani Swiggy

Swiggy One Lite సబ్‌స్క్రిప్షన్ 

Swiggy One Lite సబ్‌స్క్రిప్షన్ కింద రూ. 149 ధర కంటే ఎక్కువ ఫుడ్ ఆర్డర్‌లపై 10 ఉచిత హోమ్ డెలివరీ పొందుతారు. రూ. 199 కంటే ఎక్కువ ఇన్‌స్టామార్ట్(groceries) ఆర్డర్‌లపై 10 ఉచిత డెలివరీలను కూడా పొందుతారు. దానితో పాటు ఫుడ్ పై  ఎలాంటి సర్జ్ చార్జెస్  కూడా ఉండవు. 20,000+ రెస్టారెంట్లలో కష్టమర్లు సాధారణ ఆఫర్‌ల కంటే  30 శాతం వరకు అదనపు డిస్కౌంట్  పొందుతారని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా, మెంబర్‌షిప్ ప్లాన్‌లో రూ. 60 కంటే ఎక్కువ Swiggy Genie డెలివరీలపై 10 శాతం తగ్గింపు ఉంటుంది.

Swiggy One Lite నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 149 అయితే దీనిని  జియో ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఉచితంగా లభిస్తుంది.
 

34

కొత్త జియో డివైఇజెస్ 

జియో ఇటీవల భారతదేశంలో కొన్ని కొత్త డివైజెస్ ని కూడా లాంచ్ చేసింది. JioMotive OBD అడాప్టర్ లొకేషన్ ట్రాకింగ్,  తెఫ్ట్  అలర్ట్‌ల వంటి ఫీచర్‌లను అందించడం ద్వారా మీ సాధారణ కారును స్మార్ట్ కార్‌గా మార్చగలదు. భారతదేశంలో దీని ధర రూ.4,999. దీనిని  ఇప్పుడు Amazon, Reliance Digital e-commerce sites, Jio.com ఇంకా  సెలెక్ట్  చేసిన రిటైల్ అవుట్‌లెట్‌లలో  అందుబాటులో ఉంది.

 

Related Articles

44

Jio ఈ నెల ప్రారంభంలో భారతదేశంలో సాటిలైట్  ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్  అయిన JioSpaceFiberని కూడా ప్రారంభించింది. దీనితో హై స్పీడ్ ఇంటర్నెట్‌ని అందించడానికి కమ్యూనికేషన్ సాటిలైట్  ఉపయోగిస్తుంది కాబట్టి  JioFiber ఇంకా JioAirFiber కంటే భిన్నంగా ఉంటుంది. అయితే  ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి కేబుల్ లేదా ఫైబర్‌ని ఉపయోగిస్తుంది. గుజరాత్‌లోని గిర్, ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా, ఒడిస్సాలోని నాబ్రాంగ్‌పూర్,  అస్సాంలోని జోర్హాట్‌లోని ఓఎన్‌జిసితో సహా భారతదేశంలోని సెలెక్ట్  చేసిన ప్రాంతాలలో జియోస్పేస్ ఫైబర్ ఇప్పటికే ప్రారంభమైంది.

Recommended Photos