టైమ్-లాప్స్ ఫోటోగ్రఫీ మోడ్ తో హానర్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్.. ఇండియాలో దీని ధర ఎంతంటే ?

First Published Aug 6, 2021, 1:56 PM IST

చైనా తయారీ సంస్థ హానర్  కొత్త  స్మార్ట్‌ఫోన్ హానర్ ప్లే 5టి ప్రోను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. హానర్ ప్లే 5టి ప్రోలో 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్ అందించారు. అంతేకాకుండా ఈ ఫోన్ లో 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ హానర్ ఫోన్‌లో 4000mAh బ్యాటరీ, 6.6-అంగుళాల పంచ్  హొల్ డిస్‌ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్స్ ఉన్నాయి. 

హానర్ ప్లే 5టి ప్రో ధర

హానర్ ప్లే 5టి ప్రో ధర 1,499 చైనీస్ యువాన్ అంటే సుమారు రూ .17,178.95. ఈ ధరలో 128 జి‌బి స్టోరేజ్ వేరియంట్ 8జి‌బి ర్యామ్ లభిస్తుంది, అయితే ఈ ఫోన్ సింగిల్ వేరియంట్‌లో లాంచ్ చేసారు. ఫోన్‌ను మ్యాజిక్ నైట్ బ్లాక్, టైటానియం సిల్వర్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 11 నుండి చైనాలో అందుబాటులోకి   వస్తుంది. ఇండియన్ మార్కెట్లో దీని లాంచ్ గురించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.
 

 హానర్ ప్లే 5టి ప్రో స్పెసిఫికేషన్‌లో ఆండ్రాయిడ్ 10 ఆధారిత మ్యాజిక్ యూ‌ఐ 4.0 ఇచ్చారు. 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. డిస్‌ప్లే  స్టయిల్ పంచ్ హోల్, మీడియా టెక్ హిలియో జి80 ప్రాసెసర్, 8జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ లభిస్తుంది.
 

హానర్ ప్లే 5టి ప్రో కెమెరా

కెమెరా గురించి మాట్లాడితే  హానర్  ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించింది. హానర్ ప్లే 5టి ప్రోలోని ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ ఎపర్చరు f/1.9, రెండవ లెన్స్ 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఎపర్చరు f/2.4, ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ లెన్స్  ఎపర్చరు f/2.0 ఇచ్చారు. ఏ‌ఐ ఫోటోగ్రఫీ, హై పిక్సెల్ మోడ్, టైమ్ ల్యాప్స్ ఫోటోగ్రఫీ, వెనుక కెమెరాతో నైట్ సీన్ వంటి మోడ్‌లు ఉన్నాయి.

హానర్ ప్లే 5టి ప్రో బ్యాటరీ

హానర్ ప్లే 5టి ప్రోలో 4000mAh బ్యాటరీ, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ లభిస్తుంది. బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లో 53 శాతం వరకు ఛార్జ్ అవుతుందని పేర్కొన్నారు. కనెక్టివిటీ కోసం దీనిలో  వై-ఫై 802.11 ఏ‌సి, బ్లూటూత్ వి5.1, యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్, జి‌పి‌ఎస్, 4జి ఎల్‌టి‌ఈ , 3.5ఎం‌ఎం హెడ్‌ఫోన్ జాక్ ఉంది. ఫోన్ కి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఇచ్చారు. ఫోన్ బరువు 179 గ్రాములు.

click me!