జూన్ నుండి గూగుల్ పేకి టాటా బైబై.. షాకింగ్ సమాచారం విడుదల చేసిన గూగుల్.. పూర్తి వివరాలు ఇదిగో !!

First Published | May 20, 2024, 7:01 PM IST

ఆన్‌లైన్  పేమెంట్ యాప్ Google Payని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉపయోగిస్తున్నారు. అయితే జూన్ 4 నుండి ప్రపంచంలోని కొన్ని దేశాల్లో Google Pay సర్వీస్ Google నిలిపివేయబోతోంది. దీని తర్వాత మీరు ఈ యాప్ ద్వారా పేమెంట్స్  చేయలేరు.
 

Googleకి  చెందిన Google Pay సర్వీస్ భారతదేశంతో సహా ఇతర దేశాలలో ఆన్‌లైన్ పేమెంట్స్  కోసం ఉపయోగించబడుతుంది. అయితే 2022లో Google Walletని ప్రవేశపెట్టిన తర్వాత, Gpay యూజర్ల సంఖ్య వేగంగా పెరిగింది. ఈ యాప్ ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్  కోసం యూజర్లకు మొదటి అప్షన్ గా మారింది.

గూగుల్ ఈ నిర్ణయం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎందుకంటే జూన్ 4, 2024 నుండి USలో మాత్రమే Google Payని నిలిపివేయబోతోంది. అంటే Google Pay నిషేధం భారతదేశంలో కాదు, USలో మాత్రమే అని. జూన్ 4 తర్వాత, Google Pay యాప్ భారత్ ఇంకా సింగపూర్‌లో మాత్రమే పని చేస్తుంది.
 

Latest Videos


అయితే ఇతర దేశాల్లో ఈ సర్వీస్ పూర్తిగా నిలిపివేయబడుతుంది. కంపెనీ ప్రకారం, వినియోగదారులందరూ Google Walletకి ట్రాన్స్ఫర్  చేయబడతారు. ఈ తేదీ తర్వాత USలో Google Pay పూర్తిగా పనిచేయదు. Google Pay సర్వీస్ షట్ డౌన్ అయిన తర్వాత US యూజర్లు  ఇకపై పేమెంట్స్  చేయలేరు లేదా పొందలేరు.
 

ఇప్పటికే గూగుల్ వాలెట్‌కి మారమని యుఎస్ వినియోగదారులందరినీ గూగుల్ కోరింది. గూగుల్ వాలెట్‌ను ప్రమోట్ చేసేందుకే కంపెనీ ఇలాంటి చర్య తీసుకుందని భావిస్తున్నారు. Gpayని దాదాపు 180 దేశాలలో Google Wallet రీప్లేస్ చేసిందని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.
 

click me!