గూగుల్ క్రోమ్ అలెర్ట్: పొరపాటున కూడా ఈ పని చేయడం మరచిపోవద్దు.. లేదంటే సమస్యలు తప్పవు..

First Published | Jan 3, 2022, 12:13 PM IST

మీరు మీ లాగిన్ ఐ‌డి, పాస్‌వర్డ్‌ని గూగుల్ క్రోమ్ (Google Chrome)లో సేవ్ చేసి ఉంచినట్లయితే జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇలా చేయడం వల్ల చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు. నేటి డిజిటల్ యుగం(digital era)లో అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి. మీ చిన్న అజాగ్రత్త పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు, హ్యాకింగ్‌లకు సంబంధించిన సంఘటనలు భారీగా పెరిగాయి. మీరు ఇంటర్నెట్‌ను ఉపయోగించే వారైతే ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరగాళ్ల కళ్లు ఎప్పుడూ ఇంటర్నెట్ వినియోగదారులపైనే ఉంటాయి. మీ చిన్న పొరపాటు సమస్యలను కోరి మరి మీ ముందుకు తెస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో  ఇలాంటి సమస్యలు ఎదురుకోకుండా ఉండవచ్చు..
 

తరచుగా మనలో చాలా మంది గూగుల్ క్రోమ్ ని ఉపయోగిస్తున్నప్పుడు  లాగిన్ ఐ‌డి, పాస్‌వర్డ్‌ను అందులో సేవ్ చేస్తుంటారు. మీరు అలా చేస్తే వెంటనే అప్రమత్తంగా ఉండాలి. అలా చేయడం వల్లచాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇటీవల కొంతమంది ఐటీ రంగ పరిశోధకులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు హెచ్చరిక జారీ చేశారు. వారి ప్రకారం క్రోమ్‌లో సేవ్ చేసిన లాగిన్ ఐడి ఇంకా పాస్‌వర్డ్ హ్యాక్ చేయబడవచ్చు. మీ ప్రైవేట్ డేటా ఇంకా మీ కంపెనీ వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉందని తెలిపారు.
 

Latest Videos


కొంతకాలం క్రితం సెక్యూరిటీ ఉల్లంఘన కారణంగా ఒక కంపెనీకి చెందిన ముఖ్యమైన డేటా లీక్ అయింది. దీంతో కంపెనీ పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ కూడా అటువంటి దాడుల నుండి మిమ్మల్ని రక్షించదు.  అందుకే బ్రౌజర్‌లో మీ లాగిన్ ఐ‌డిని ఎప్పుడూ సేవ్ చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి.

అలాగే ఎల్లప్పుడూ అధికారిక యాప్‌లను మాత్రమే ఉపయోగించండి. మీరు అవిశ్వసనీయ లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయకూడదు. వాటిని తెరవడం వలన మీ డివైజ్ లేదా స్మార్ట్ ఫోన్ లోకి వైరస్ లేదా ఏదైనా రకమైన మాల్వేర్ ఎటాక్ జరిగే అవకాశాలు పెరుగుతాయి.

click me!