వాట్సప్ స్కామ్: మీరు కూడా బాధితులు కావచ్చు, ఇలాంటి లింక్ పై క్లిక్ చేయకండి..

First Published | Dec 30, 2021, 1:11 PM IST

 ఫేస్ బుక్ యజమాన్యంలోని వాట్సప్ ( WhatsApp) ప్రస్తుతం అతిపెద్ద మల్టీమీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అలాగే ఆన్‌లైన్ హ్యాకర్స్ (online hackers)కూడా దాని నుండి ప్రయోజనాన్ని పొందుతున్నారు. తాజాగా వాట్సాప్‌లో Rediroff.ru పేరుతో ఒక కొత్త స్కామ్ నడుస్తోంది.

 దీని సహాయంతో, హ్యాకర్లు మీ WhatsApp ఖాతాను హ్యాక్ చేయడమే కాకుండా, మీ బ్యాంక్ ఖాతా సమాచారాన్ని రహస్యంగా పొందవచ్చు. దీనితో పాటు స్పామ్ లింక్ కూడా షేర్ చేయబడుతోంది, మీరు దీన్ని నివారించాలి. ఈ స్కామ్ ఎంత కాలంగా సాగిందో ఇంకా తెలియలేదు కానీ చాలా మంది బాధితులుగా మారారు.

హ్యాకర్లు ఎలా మోసం చేస్తున్నారు
ఆన్‌లైన్ హ్యాకర్లు వాట్సాప్ వినియోగదారులకు మొదట లింక్‌ను పంపుతున్నారు. సర్వేలో పాల్గొన్నందుకు మీరు చాలా రివార్డ్‌లను పొందుతారని ఈ లింక్‌తో క్లెయిమ్ చేస్తున్నారు. వినియోగదారు ఒకటి లేదా రెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వెంటనే, అతను మరొక వెబ్‌సైట్‌కి తీసుకెళ్లబడుతుంది. ఆ తర్వాత వినియోగదారులు పేరు, వయస్సు, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, చిరునామా మొదలైన సమాచారాన్ని కోరుతున్న ఫారమ్‌ను నింపని అడుగుతారు.
 

Latest Videos


ఈ సమాచారం సాయంతో హ్యాకర్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ సమాచారం డార్క్ వెబ్‌లో కూడా అమ్ముడవుతోంది. అంతేకాకుండా, వినియోగదారుల లొకేషన్‌ను ట్రాక్ చేయడం ద్వారా, వెబ్‌సైట్  భాషను మార్చడం ఇంకా వివిధ రకాల పేమెంట్ సేవలను పేజీలో చూపడం జరుగుతుంది.
 

ఇలాంటి మోసాలను నివారించే మార్గం ఏమిటి?
మీరు లింక్‌ ఉన్న మెసేజ్ లేదా లింక్‌లో 'Rediroff.ru' ఉన్నట్లయితే, వెంటనే ఆ మెసేజ్ ని నివేదించండి. అంతే కాకుండా ఈ లింక్‌పై క్లిక్ చేయడంలో పొరపాటు చేయవద్దు. మెసేజ్‌ని వెంటనే డిలీట్ చేసి ఎవరికీ ఫార్వార్డ్ చేయకండి. పొరపాటున లింక్ క్లిక్ చేసినట్లయితే ఫారమ్‌లో మీ వివరాలను నింపవద్దు. మీరు ఇన్‌స్టాల్ చేయని యాప్ మీ ఫోన్‌లో ఉంటే, వెంటనే దాన్ని తొలగించండి.

click me!