గోద్రేజ్ స్పాట్‌లైట్ హోమ్ సెక్యూరిటీ కెమెరా.. ఇప్పుడు దీనిని హ్యాకర్లు కూడా హ్యాక్ చేయలేరు..

First Published | Jul 24, 2021, 3:15 PM IST

 గోద్రేజ్ గ్రూప్ చెందిన గోద్రేజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్  హోమ్ రేంజ్ కెమెరాను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కెమెరాల పేరు 'స్పాట్‌లైట్', దీనిని భారతదేశంలోనే రూపొందించి తయారు చేశారు. ఈ హోమ్ సెక్యూరిటీ కెమెరా  బెస్ట్ డేటా భద్రతగా క్లెయిమ్ చేయబడింది.

గోద్రేజ్ కెమెరాల స్పాట్‌లైట్ శ్రేణి అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)ను ఉపయోగిస్తుంది. స్పాట్‌లైట్ హోమ్ సెక్యూరిటీ కెమెరాని చాలా అందంగా రూపొందించారు అలాగే ఇంటర్నల్ వై-ఫైతో వస్తుంది. మీరు మొబైల్ యాప్ ద్వారా కెమెరాను రిమోట్‌గా కంట్రోల్ చేయవచ్చు. ఈ యాప్ సున్నితమైన స్ట్రీమింగ్, లో బ్యాండ్‌విడ్త్ వినియోగిస్తుంది. కెమెరా నుండి రికార్డ్ చేసిన వీడియో అమెజాన్ కైనెసిస్ వీడియో స్ట్రీమ్స్ ద్వారా కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ డివైజ్ కి సురక్షితంగా ప్రసారం చేస్తుంది.
undefined
కెమెరా డేటా ఏ‌డబల్యూ‌ఎస్ (ఆసియా పసిఫిక్) ముంబై ప్రాంతంలో ఏ‌ఈ‌ఎస్ 256-bit ఎన్ క్రిప్ట్ ద్వారా స్టోర్ చేయబడుతుంది. ఈ కెమెరా సిరీస్ వి‌ఏ‌పి‌టి సర్టిఫై చేయబడింది, అంటే డేటాని సైబర్ దాడుల నుండి రక్షిస్తుంది.
undefined

Latest Videos


స్పాట్‌లైట్ పి‌టి. (పాన్-టిల్ట్) మీరు కెమెరాను తిప్పడం ద్వారా పెద్ద ప్రాంతాన్ని కవర్ చేయవచ్చు, ఎందుకంటే ఈ కెమెరా 90 డిగ్రీల వరకు తిరుగుతుంది అలాగే పాన్ 355 డిగ్రీల వరకు ఉంటుంది. కెమెరాలో మీ లొకేషన్ 110-డిగ్రీల పానోరమిక్ వ్యూ ఫీచర్ ఉంది. స్మార్ట్ మోషన్ ట్రాకింగ్, రియల్ టైమ్ మోషన్ అలెర్ట్స్, అల్ట్రా-క్లియర్ నైట్ విజన్, హై-ఫిడిలిటీ మైక్ సపోర్ట్ అండ్ వన్-టచ్ మోడ్‌లు ఉన్నాయి.
undefined
స్పాట్‌లైట్ రేంజ్‌లోని కెమెరాలు రూ .4,999 నుంచి ప్రారంభమై ఒక సంవత్సరం వారంటీతో వస్తాయి. షాపింగ్ చేయడానికి ముందు వినియోగదారులు కంపెనీ వెబ్‌సైట్‌లో కెమెరాను వర్చువల్ గా ఎక్స్పిరియన్స్ చేయవచ్చు. గోద్రేజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ షాప్ సైట్ అండ్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో లభిస్తుంది.
undefined
click me!