500 గంటల స్టాండ్‌బైతో శామ్‌సంగ్ కొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర ఎంతంటే ?

First Published | Feb 5, 2021, 4:31 PM IST

ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్‌సంగ్  భారతదేశంలో  ఒక కొత్త  నెక్‌బ్యాండ్  లాంచ్ చేసింది. శామ్‌సంగ్ లెవల్ యు2గా వస్తున్న ఈ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌ల బ్యాటరీ లైఫ్ 500 గంటల స్టాండ్‌బై ఉంటుందని పేర్కొంది. 

వాటర్ రిసిస్టంట్ కోసం శామ్‌సంగ్ లెవెల్ యు2 IPX2 రేట్ చేయబడింది. దీనిలో 12 ఎంఎం ఆడియో డ్రైవర్ అందించారు. అలాగే, శామ్‌సంగ్ స్కేలబుల్ కోడెక్ టెక్నాలజీ ఇందులో అమర్చారు. శామ్‌సంగ్ లెవల్ యు2 మొదట దక్షిణ కొరియాలో లాంచ్ చేశారు.
శామ్‌సంగ్ లెవెల్ యు2 ధరభారతదేశంలో శామ్‌సంగ్ లెవెల్ యు2 ధర రూ .1,999. దీనిని బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. దీనిని ఫ్లిప్‌కార్ట్ ఇంకా శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు. శామ్‌సంగ్ నెక్‌బ్యాండ్ రియల్‌మీ, షియోమి, పిట్రాన్ బ్రాండ్ ఇయర్‌ఫోన్‌లతో పోటీపడుతుంది.

శామ్‌సంగ్ లెవెల్ యు2 స్పెసిఫికేషన్లుశామ్‌సంగ్ లెవెల్ యు2 లో 12ఎం‌ఎం డ్రైవర్, కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0తో వస్తుంది. బెస్ట్ కాలింగ్ కోసం దీనిలో రెండు మైక్రోఫోన్లు అమర్చారు. దీనికి ఏ‌ఏ‌సి, ఎస్‌బి‌సి ఇంకా స్కేలబుల్ కోడెక్ సపోర్ట్ ఉంది. ఇంకా దీనిని మెడలో ధరించడానికి విలాసవంతమైన డిజైన్ తో ప్రత్యేకంగా రూపొందించారు.
ఈ ఇయర్‌ఫోన్‌కి ఫిజికల్ బటన్లు అందించారు, ఇవి కాల్స్ స్వీకరించడానికి, మ్యూట్ చేయడానికి, కాల్స్ కట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఒక ఫుల్ చార్జ్ తో 500 గంటల స్టాండ్‌బై, 18 గంటల మ్యూజిక్ ప్లే-బ్యాక్, 13 గంటల టాక్‌టైమ్ ఉంటుంది. దీనిని ఛార్జింగ్ చేయడానికి యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉంది. దీని బరువు 41.5 గ్రాములు.

Latest Videos

click me!