
బడ్జెట్ దాటకుండా, లేటెస్ట్ ఫీచర్లతో మంచి స్మార్ట్ వాచ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో రూ.10000 లోపు లభించేవి చాలానే ఉన్నాయి. వీటిలో టాప్ 5 స్మార్ట్ వాచ్ ల పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
స్మార్ట్ వాచ్ లు ఆరోగ్యం, ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ విభాగంలోని చాలా వాచ్ లలో హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలు (SpO2), స్లీప్, స్ట్రెస్ మానిటరింగ్ ఫీచర్లు ఉంటాయి. వాకింగ్, రన్నింగ్, యోగా సహా వివిధ స్పోర్ట్స్ మోడ్లు కూడా ఉన్నాయి. ఇలా రోజువారీ అవసరాలకు తగిన ఫీచర్లన్నీ వీటిలో ఉన్నాయి.
బడ్జెట్ ధరలో ప్రీమియం డిజైన్, అధునాతన ఫీచర్లతో వచ్చే టైటాన్ సెలెస్టార్ ఇండియాలోని బెస్ట్ స్మార్ట్ వాచ్ లలో ఒకటి. ఇందులో ఇన్ బిల్ట్ జీపీఎస్, సింగిల్ సింక్ బ్లూటూత్ కాలింగ్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ (SOS) ఫీచర్లు ఉన్నాయి… ఇవి అవుట్ డోర్ ట్రిప్ లకు బాగా ఉపయోగపడతాయి. దీని ధర రూ. 9,995 గా ఉంది.
ఫీచర్లు
1.43 అంగుళాల అమోలెడ్ (AMOLED) డిస్ప్లే (750 నిట్స్ బ్రైట్నెస్), ఆండ్రాయిడ్ ఓఎస్, బీజ్, గ్రే కలర్స్, హార్ట్ రేట్, మల్టీస్పోర్ట్ ట్రాకర్, 10 రోజుల బ్యాటరీ లైఫ్, 46.5 గ్రాముల బరువు. చెమటను తట్టుకునే డ్యూరబుల్ స్ట్రాప్, స్టైలిష్ ప్రీమియం డిజైన్, పెట్టిన డబ్బుకు తగ్గ వాల్యూ ఇస్తుంది.
టైటాన్ ఎవోక్ 2.0 స్మార్ట్ వాచ్ (Titan Evoke 2.0)
స్లీక్ మెటల్ డిజైన్, డ్యూరబిలిటీ కోరుకునే వారికి టైటాన్ లోనే ఎవోక్ 2.0 మంచి ఎంపిక. ఇందులో 24x7 హార్ట్ రేట్ మానిటరింగ్, ఆటో స్ట్రెస్, స్లీప్ ట్రాకింగ్, మహిళల కోసం ప్రత్యేక హెల్త్ ఫీచర్లు, 100కు పైగా స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. 3డీ డైనమిక్ వాచ్ ఫేస్‌లు కూడా ఉన్నాయి. దీని ధర రూ. 7,995 నుంచి రూ. 8,995 గా ఉంది.
ఫీచర్లు - 1.32 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే (1000 నిట్స్ బ్రైట్నెస్), బ్రౌన్ కలర్, బ్లూటూత్ కాలింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, 5 రోజుల బ్యాటరీ లైఫ్, 56.8 గ్రాముల బరువు. స్టైలిష్, కాంపాక్ట్ డిజైన్, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
మహిళలు, పురుషులకు అనువైన ఈ రియల్ మీ స్మార్ట్ వాచ్ తక్కువ ధరలో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. రూ. 5,000 లోపు (రూ. 4,499 నుంచి రూ. 4,999 వరకు) లభించే ఇందులో బ్లూటూత్ కాలింగ్, బీటీ ఇంటర్‌కామ్, ఐపీ68 (IP68) మెటాలిక్ డిజైన్, బ్లూటూత్ మ్యూజిక్ ప్లేబ్యాక్, గేమ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఫీచర్లు - 1.97 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, బ్లాక్, గ్రే కలర్స్, హార్ట్ రేట్ మానిటర్, ఇండిపెండెంట్ జీపీఎస్, 16 రోజుల బ్యాటరీ లైఫ్. ఖచ్చితమైన హార్ట్ రేట్ ట్రాకింగ్, ఫిట్నెస్ ట్రాకింగ్ కు బాగా పనికొస్తుంది, స్లీక్ డిజైన్, బడ్జెట్‌కి తగ్గ బెస్ట్ ఆప్షన్.
లైట్ వెయిట్, ప్రీమియం స్టెయిన్ లెస్ స్టీల్ డిజైన్ తో వచ్చే ఈ వాచ్ 'నాయిస్ ఏఐ ప్రో' (Noise AI Pro) టెక్నాలజీతో పనిచేస్తుంది. దీని ద్వారా హెల్త్ అప్డేట్స్ తెలుసుకోవడంతో పాటు వాయిస్ కమాండ్ ఫీచర్ ను వాడొచ్చు. దీని ధర రూ. 6,999 నుంచి రూ. 7,999 మధ్య ఉంటుంది.
ఫీచర్లు - 1.46 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే (1000 నిట్స్ బ్రైట్నెస్), బ్లాక్ కలర్, అలారం, టచ్ స్క్రీన్ ఫీచర్లు, 9 రోజుల వరకు బ్యాటరీ లైఫ్, 30 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెన్స్. డ్యూరబుల్ ప్రీమియం డిజైన్, మంచి బ్యాటరీ లైఫ్, పెట్టిన డబ్బుకు తగ్గ క్వాలిటీ ఉంటుంది.
లైట్ వెయిట్ ఉండే అమేజ్ ఫిట్ బిప్ 6లో 140కి పైగా స్పోర్ట్స్ మోడ్లు, పర్సనలైజ్డ్ ఏఐ కోచ్ (AI coach) ఫీచర్ ఉన్నాయి. కచ్చితమైన నావిగేషన్ కోసం జీపీఎస్, వాటర్ రెసిస్టెన్స్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, స్లీప్ ట్రాకింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ. 7,499 నుంచి రూ. 7,999 మధ్య ఉంటుంది.
ఫీచర్లు - అమోలెడ్ డిస్ప్లే, జెప్ ఓఎస్ (Zepp OS), బ్రౌన్ కలర్, ఏఐ అసిస్టెన్స్, జీపీఎస్, 512 ఎంబీ స్టోరేజ్, 14 రోజుల బ్యాటరీ లైఫ్. నమ్మకమైన క్వాలిటీ, లాంగ్ బ్యాటరీ లైఫ్, బడ్జెట్‌కి తగ్గ బెస్ట్ వాల్యూ అందిస్తుంది.