జాగ్రత్తగా! ఐఫోన్ నకిలీ వాట్సాప్.. పొరపాటున ఇన్స్టాల్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ కావచ్చు..

First Published Feb 6, 2021, 12:31 PM IST

ప్రస్తుతం ఉన్న రోజుల్లో వాట్సాప్ వాడని వారు లేరు. అయితే తాజాగా వాట్సాప్  నకిలీ వెర్షన్ చాలా వైరల్ అవుతోంది. వాట్సాప్  ఈ నకిలీ వెర్షన్‌ను ఐఫోన్ కోసం ఇటాలియన్ నిఘా సంస్థ సై 4 గేట్ తయారు చేసినట్లు సమాచారం. ఐఫోన్ కోసం ప్రారంభించిన ఈ వాట్సాప్ యాప్ వినియోగదారుల ఫోన్‌ల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తుందని  ఇంకా మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్లకు చేరవేస్తుందని ఒక నివేదిక తెలిపింది.
 

ఈ నకిలీ వాట్సాప్ యాప్ సహాయంతో హ్యాకర్లు మీ ఫోన్‌లో సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయగలరని, దాని నుండి మీ వ్యక్తిగత సమాచారాన్ని సులభంగా తస్కరించవచ్చని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. సిటిజెన్ ల్యాబ్ వాట్సాప్ కొత్త నకిలీ వెర్షన్ గురించి సమాచారం ఇచ్చింది.
undefined
టొరంటో విశ్వవిద్యాలయంలోని సైబర్‌స్పేస్ రీసెర్చ్ ల్యాబ్ అండ్ సిటిజెన్ ల్యాబ్ ఐఫోన్ కోసం విడుదల చేసిన ఈ నకిలీ వాట్సాప్‌ను గుర్తించాయి. ఈ నకిలీ యాప్‌ను సై 4 గేట్ తయారు చేసిందని ఒక నివేదిక పేర్కొంది. వినియోగదారుల వ్యక్తిగత డాటాపై దాడులను గురించి ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ జెకాప్స్ ట్వీట్ చేసినప్పుడు ఈ నకిలీ వాట్సాప్ బయటపడింది.
undefined
మదర్‌బోర్డు నివేదిక ప్రకారం, config5-dati.com డొమైన్‌లోని వెబ్‌సైట్ రహస్యంగా ఫైల్‌లను పంపించడం ద్వారా వినియోగదారుల ఫోన్‌లపై నిఘా పెట్టడానికి ఉపయోగిస్తుంది. అంతేకాకుండా ఈ వెబ్‌సైట్ ఈ సమాచారాన్ని హ్యాకర్లకు పంపుతున్నట్లు నివేదిక పేర్కొంది.
undefined
config1-dati [.] com చాలా ఫిషింగ్ పేజీలలో కూడా కనిపించింది. వాట్సాప్ డిజైన్ నుండి ఈ డొమైన్ వరకు ఐఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన ప్రతిదీ నిజమైన యాప్ లాగా ఉంటుంది. ఇన్‌స్టాల్ చేయడానికి సూచనలు కూడా ఇచ్చారు. వాట్సాప్ నకిలీ వెర్షన్ సై 4 గేట్ చేత తయారు చేయబడిందా లేదా మరొకరిచే తయారు చేయబడిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ నకిలీ వెర్షన్‌పై చర్యలు తీసుకుంటామని వాట్సాప్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
undefined
2019 లో ఇజ్రాయెల్ ఎన్ఎస్ఓ గ్రూప్ తయారుచేసిన పిగాసస్ సాఫ్ట్‌వేర్ ద్వారా పెద్ద గూఢాచర్యం జరిగింది, ఇందులో అమెజాన్ సిఇఒతో సహా ప్రపంచంలోని పలువురు జర్నలిస్టులు, ప్రపంచంలోని సామాజిక కార్యకర్తల వాట్సాప్ ఖాతా హ్యాక్ గురైంది. భారతదేశానికి చెందిన కొంతమంది వాట్సాప్ ఖాతాలు కూడా హ్యాక్ గురైనట్లు సమాచారం.
undefined
undefined
click me!