1. ఎం5 చిప్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్
మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం5 కొనడానికి అతిపెద్ద కారణం ఇందులోని కొత్త ఎం5 ప్రాసెసర్. ఇందులో 10-కోర్ సీపీయూ, 10-కోర్ జీపీయూ, 16-కోర్ న్యూరల్ ఇంజిన్, హార్డ్‌వేర్ బేస్డ్ రే ట్రేసింగ్ వంటి ఫీచర్లున్నాయి. దీని మెమరీ బ్యాండ్‌విడ్త్ సెకనుకు 153 జీబీ వరకు ఉంటుంది.
16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వచ్చే ఈ మోడల్ మల్టీటాస్కింగ్, ఆఫీస్ పనులు, కోడింగ్, కంటెంట్ క్రియేషన్, ఫోటో-వీడియో ఎడిటింగ్ వంటి పనులకు చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. పాత M1 మోడల్స్‌తో పోలిస్తే AI వీడియో ప్రాసెసింగ్, 3D రెండరింగ్, ఫోటో ఎడిటింగ్ వంటివి చాలా వేగంగా చేయగలదని యాపిల్ చెబుతోంది.
2. తేలికైన ప్రీమియం డిజైన్
మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం5 డిజైన్ పాత మోడల్ లాగే ఉన్నా సన్నని అల్యూమినియం బాడీ, తక్కువ బరువు మార్కెట్లో ఉన్న బెస్ట్ ప్రీమియం ల్యాప్‌టాప్‌లలో ఒకటిగా నిలబెడుతున్నాయి. ఫ్యాన్ లేని డిజైన్ కాబట్టి పనిచేస్తున్నప్పుడు ఎలాంటి శబ్దం రాదు. సాధారణ బ్రౌజింగ్, డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, ఆన్‌లైన్ మీటింగ్‌లు, వీడియోలు చూడటం వంటి పనులకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా బ్యాటరీ వస్తుంది.
3. సూపర్ డిస్‌ప్లే, కెమెరా
13 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో వస్తున్న ఈ ల్యాప్‌టాప్‌లో 2560 × 1664 రిజల్యూషన్, 500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటాయి. దీనివల్ల అక్షరాలు, బొమ్మలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరా ఇచ్చారు. ఈ ఫీచర్ వల్ల మనం కదిలినా కెమెరా మనల్ని ఫ్రేమ్‌లోనే ఉంచుతుంది. దీని కీబోర్డ్, ట్రాక్‌ప్యాడ్ వాడటానికి చాలా సౌకర్యంగా ఉంటాయి.