ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రతీ ఒక్కరూ కచ్చితంగా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు. మరి కేవలం రూ. 6 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
itel ZENO 10: రూ. 6వేల బడ్జెట్‌లో అందుబాటులో బెస్ట్ ఫోన్ ఐటెల్ జెనో 10. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 6,89కాగా అమెజాన్‌లో 16 శాతం డిస్కౌంట్‌తో రూ. 5799కి లభిస్తోంది. ఈ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడని హెచ్‌డీ+ డిస్‌ప్లేను అదించారు. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కెపాసిటీతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.
25
poco-c61
Poco c61: రూ. 6వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ఫోన్ పోకో సీ61. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 8999కాగా 34 శాతం డిస్కౌంట్‌తో రూ. 5899కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.71 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించార. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ చేస్తుంది. ఇక ఈ ఫోన్ స్నాప్‌డ్రాన్ ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే 8 ఎంపీ రెయిర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.
35
samsung
Samsung Galaxy M05: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 9,999కాగా ప్రస్తుతం అమెజాన్‌లో 35 శాతం డిస్కౌంట్‌తో రూ. 6499కి లభస్తోంది. అదనంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 200 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. అలాగే 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే 50 ఎంపీ రెయిర్ కెమెరా, 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
45
LavaA03
Lava o3: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో అందుబాటులో ఉన్న ఫోన్‌లలో లావా ఓ3 ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 7,199కాగా అమెజాన్‌లో డిస్కౌంట్‌తో రూ. 6499కి లభిస్తోంది. ఈ అదనంగా అమెజాన్ కూపన్ అప్లై చేసుకుంటే రూ. 500 డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఫోన్‌లో 6.75 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 13 ఎంపీ రెయిర్ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.
55
redmi
Redmi A3X: రెడ్మీ ఏ3ఎక్స్ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 10,499కాగా అమెజాన్‌లో ఏకంగా 41 శాతం డిస్కౌంట్‌తో రూ. 6195కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియాటెక్ ఎమ్‌టీ8125 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. 6.71 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ స్క్రీన్‌ను ఇచ్చిన ఈ ఫోన్‌లో ఎంపీ రెయిర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.