పాకిస్థాన్ జట్టు గ్రూప్-ఏలో అద్భుత ప్రదర్శన చేసింది. ఆడిన 4 మ్యాచ్‌లలో 3 గెలిచి రెండో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్‌పై 3 వికెట్ల విజయం, అమెరికాపై 32 పరుగుల తేడాతో గెలుపు, నమీబియాపై 102 పరుగుల భారీ విజయం నమోదు చేసింది. అయితే భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం 61 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
అటు న్యూజిలాండ్ సైతం గ్రూప్-డిలో 4 మ్యాచ్‌లలో 3 గెలిచి రెండో స్థానాన్ని దక్కించుకుంది. అఫ్గానిస్థాన్‌పై 5 వికెట్లు, యూఏఈపై 10 వికెట్లు, కెనడాపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయాలు సాధించింది. అయితే దక్షిణాఫ్రికా చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం పొందింది.
తర్వాతి మ్యాచ్ లు ఏ జట్లు ఆడనున్నాయి?
ఆదివారం సూపర్-8లో రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. పల్లెకెలె లో ఇంగ్లాండ్, శ్రీలంక తలపడనున్నాయి. గ్రూప్-2 సమీకరణాల దృష్ట్యా ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఇక రెండో మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.