IPL Auction: జాక్ పాట్ కొట్టేసిన భారత కుర్రాళ్ళు వీరే!

First Published Dec 20, 2019, 4:48 PM IST


ఐపీఎల్ 2020 వేలంలో పాటలో  కుర్రాళ్ల జోరు కొనసాగింది. బేసిక్ ప్రైస్ కంటే అధిక ధరలకు కుర్రాళ్ళు అమ్ముడుపోతుంటే.. టాప్ ఫ్లెయిర్స్‌ను మాత్రం ప్రాంఛైజీలు పట్టించుకోలేదు. 

2019 వేలంలో జయదేవ్ ఉనద్కట్‌తో కలిసి 8.4 కోట్ల రూపాయల అత్యధిక బీడ్ సాధించాడు తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.  2020 సీజన్ కి సంబంధించి నిన్న జరిగిన వేలంలో ఈ మిస్టరీ స్పిన్నర్, అత్యధిక ధర పలికిన అన్ కాప్డ్ ఇండియన్ ప్లేయర్ గా  రికార్డు సృష్టించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని 4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
undefined
రూ .30 లక్షల బేస్ ప్రైస్ కలిగిన వరుణ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కెకెఆర్ ల మధ్య తీవ్రమైన బిడ్డింగ్‌ నడిచింది.
undefined
28 ఏళ్ల ఈ మిస్టరీ స్పిన్నర్, ఐపీఎల్ 2019 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఒక్క మ్యాచులో మాత్రమే ఆడాడు. అతను వేసిన మొదటి ఓవర్లో సునీల్ నరైన్ అతన్ని ఊచకోత కోస్తూ 25 పరుగులు పిండుకున్నాడు. ఆ మ్యాచ్ తరువాత అతను తమిళనాడుకు కూడా ఆడలేదు.
undefined
లెగ్ బ్రేక్ బౌలర్, ఇండియా అండర్ -19 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడైన రవి బిష్ణోయిని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన బేస్ ప్రైస్ కంటే 10 రెట్లు (రూ .20 లక్షలు) రూ .2 కోట్లకు కొనుగోలు చేసింది. కింగ్స్ ఎలెవన్ బిష్నోయిని దక్కించుకోవటానికి బిడ్డింగ్ లో  MI తో తీవ్రంగా పోటీ పడ్డారు.
undefined
ఇక మరో యంగ్ టాలెంట్, పదిహేడేళ్ల ముంబై బ్యాట్స్‌మన్ యశస్వి జైస్వాల్.  2.4 కోట్ల రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ కు వెళ్లాడు. ఆర్ఆర్, కెకెఆర్ లు ఒకరితో ఒకరు పోటీ పడే ముందు ముంబై ఇండియన్స్ ప్రారంభ బిడ్ వేశారు. ఆర్‌ఆర్ చివరికి ఇండియా అండర్ -19 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌ను దక్కించుకుంది.
undefined
ప్రస్తుత ఇండియా అండర్ -19 కెప్టెన్ ప్రియమ్ గార్గ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ .1.9 కోట్లకు కొనుగోలు చేసింది, అదే ధరతో జార్ఖండ్ బ్యాట్స్‌మన్ విరాట్ సింగ్‌ను సైతం కొనుగోలు చేసింది. ఇద్దరు ఆటగాళ్ల బేస్ ప్రైస్ కూడా 20 లక్షలే.
undefined
మరో అండర్ -19 ఆటగాడు కార్తీక్ త్యాగి ని బేస్ ప్రైస్ 20 లక్షలకు మించి 1.3 కోట్లకు ఆర్‌ఆర్ కొనుగోలు చేసింది.  వరుణ్ చక్రవర్తి కెకెఆర్  రూ .4 కోట్లు యశస్వి జైస్వాల్ ఆర్‌ఆర్ 2.4 కోట్లు రవి బిష్ణోయ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2 కోట్లు ప్రియమ్ గార్గ్ ఎస్‌ఆర్‌హెచ్ 1.9 కోట్లు విరాట్ సింగ్ ఎస్‌ఆర్‌హెచ్ 1.9 కోట్లు కార్తీక్ త్యాగి ఆర్‌ఆర్ 1.3 కోట్లు
undefined
click me!