Triple Century in T20: టీ20లో ట్రిపుల్ సెంచరీ.. 30 సిక్సర్లు, 27 ఫోర్లతో రికార్డుల మోత మోగించిన యంగ్ ప్లేయర్

Published : Oct 27, 2026, 02:12 PM IST

Triple Century in T20: క్రికెట్ హిస్టరీలో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఢిల్లీ స్కూల్ టీ20 లీగ్‌లో ఆర్యన్ శర్మ అనే యంగ్ ప్లేయర్ ట్రిపుల్ సెంచరీ బాదాడు. 93 బంతుల్లో 27 ఫోర్లు, 30 సిక్సర్లతో ఏకంగా 311 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు.

PREV
14
టీ20లో ట్రిపుల్ సెంచరీ

క్రికెట్ ప్రపంచంలో టీ20 ఫార్మాట్ అంటేనే జోరు. కేవలం 20 ఓవర్ల ఆటలో పరుగులు రాబట్టడమే అందరి లక్ష్యం. ఒకప్పుడు ఈ ఫార్మాట్‌లో సెంచరీ చేయడమే పెద్ద రికార్డు. కానీ ఇప్పుడు కాలం మారింది. తాజాగా ఢిల్లీలో జరిగిన స్కూల్ క్రికెట్ మ్యాచ్‌లో ఓ యంగ్ ప్లేయర్ ఏకంగా టీ20 ఫార్మాట్‌లో ట్రిపుల్ సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

24
ఆర్యన్ శర్మ సంచలన ఇన్నింగ్స్

ఢిల్లీ స్కూల్ టీ20 లీగ్‌లో సుమేర్మల్ జైన్ స్కూల్ తరఫున ఆడుతున్న ఆర్యన్ శర్మ ఈ రికార్డు సృష్టించాడు. ఇంద్రప్రస్థ వరల్డ్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్యన్ మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. అతను కేవలం 93 బంతులు మాత్రమే ఎదుర్కొని 27 ఫోర్లు, 30 భారీ సిక్సర్ల సాయంతో ఏకంగా 311 పరుగులు సాధించాడు. కేవలం బౌండరీల రూపంలోనే అతను 298 పరుగులు బాదడం విశేషం. దీనికి సంబంధించిన స్కోర్‌కార్డ్ స్క్రీన్‌షాట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

34
భారీ స్కోరు సాధించిన జట్టు

ఆర్యన్ శర్మ వీరవిహారం కారణంగా సుమేర్మల్ జైన్ పబ్లిక్ స్కూల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఏకంగా 389 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతటి భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంద్రప్రస్థ స్కూల్ జట్టు ఒత్తిడికి గురైంది. ఆ జట్టు 19.5 ఓవర్లలో 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో సుమేర్మల్ జైన్ స్కూల్ జట్టు భారీ తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది.

44
సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న రికార్డు

ఈ చిన్న వయసులోనే టీ20 ఫార్మాట్‌లో ట్రిపుల్ సెంచరీ కొట్టడం చిన్న విషయం కాదు. క్రికెట్ ప్రేమికులు ఈ రికార్డును సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఈ కుర్రాడు ఆడిన తీరు భవిష్యత్తులో పెద్ద స్టేజ్‌పై రాణించగలడనే నమ్మకాన్ని ఇస్తోంది. ప్రస్తుతం ఈ రికార్డు క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories