ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీ టైటిల్ గెలిచిన లియోనెల్ మెస్సీ టీమ్‌కి బంగారపు ట్రోఫీతో పాటు రూ.344 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ కూడా దక్కింది. అరబ్ దేశంలో తొలిసారి ఫిఫా వరల్డ్ కప్‌ని ఎలాంటి ఆటంకాలు, అవంతరాలు లేకుండా నిర్వహించడంలో సూపర్ సక్సెస్ సాధించింది ఖతర్...
Image Credit: Getty Images
ఖతర్‌కి ఫిఫా వరల్డ్ కప్పులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చినా, గత రికార్డులను తిరగరాస్తూ అద్భుతంగా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ని నిర్వహించగలిగింది ఖతర్. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత లియోనెల్ మెస్సీని ఖతర్ సంప్రదాయం ప్రకారం సత్కరించారు ఖతర్ కింగ్...
ట్రోఫీ అందుకోవడానికి వచ్చిన లియోనెల్ మెస్సీకి గౌరవప్రదంగా నల్ల కోటును తొడిగిన ఖతర్ సుల్తాన్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీ, ట్రోఫీని అందించాడు. స్టేజీపైన మెస్సీకి తొడిగింది ఖతర్ రాజే అయినా దీన్ని పంపించింది మాత్రం ఒమన్‌కి చెందిన అహ్మద్ అల్ బర్వానీ...
Lionel Messi Bisht
అప్పుడు బాగానే పంపించినా ఇప్పుడు దాన్ని వెనక్కి ఇవ్వాలని మెస్సీని కోరుతున్నాడు అహ్మద్ అల్ బర్వానీ... చూడడానికి ముస్లిం మహిళలు ధరించే బురఖాలా ఉంటూ... చాలా పారదర్శకంగా ఉంటే ఈ నల్ల కోటును బిష్త్ అని పిలుస్తారు..
Lionel Messi
దీని ఖరీదు 10 లక్షల డాలర్లు. అంటే అక్షరాల 8 కోట్ల 26 లక్షల రూపాయలకు పైగా... చూడడానికి పల్చని గుడ్డ ముక్కలా ఉన్నా దీని అంచులను స్వచ్ఛమైన బంగారంతో అల్లుతారు. కాలర్ దగ్గర బంగారంతో పాటు అత్యంత విలువైన వజ్రాలను కూడా పొదుగుతారు...
Lionel Messi
‘డియర్ మెస్సీ... ఫిఫా వరల్డ్ కప్ గెలిచినందుకు నీకు కంగ్రాట్స్. నలుపు, బంగారు వర్ణంలో మెరిసిపోయే బిష్త్, అరబిక్ శౌర్యానికి చిహ్నం. నువ్వు దాన్ని తిరిగి ఇస్తే దాని విలువకు సమానమైన 10 లక్షల డాలర్లు నీకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. అది మా సంప్రదాయానికి ప్రతీక. మా దేశంలో ఉంటేనే దానికి గౌరవం..’ అంటూ ట్వీట్ చేశాడు అహ్మద్ అల్ బర్వానీ...
Image credit: Getty
అయితే బర్వానీ ట్వీట్‌ను తీవ్రంగా తప్పుబడుతున్నారు ఫుట్‌బాల్ ఫ్యాన్స్. తమ దేశం దాటి వెళితే, దాని విలువ, గౌరవం తగ్గిపోతుందని అనుకున్నప్పుడు.. దాన్ని మెస్సీకి కప్పడం దేనికని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. బహుమానం ఇచ్చి, దాన్ని తిరిగి ఇవ్వాలని కోరడం మెస్సీని అవమానించడమే అవుతుందని అంటున్నారు నెటిజన్లు..