దీని కోసం ఎంత శ్రమించావో చూశా... వరల్డ్ కప్ విజయం తర్వాత లియోనెల్ మెస్సీ భార్య ఎమోషనల్...

First Published | Dec 19, 2022, 5:26 PM IST

ఫుట్‌బాల్ లెజెండ్‌గా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నా, కెరీర్‌లో ఒక్క వరల్డ్ కప్ గెలవలేదన్న లోటును ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీతో తీర్చుకున్నాడు లియోనెల్ మెస్సీ. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ముందుండి అర్జెంటీనాని విజేతగా నిలిపాడు మెస్సీ...

పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో లియోనెల్ మెస్సీ సిద్ధహస్తుడు. ఫైనల్‌లో ఇదే టాలెంట్‌ వాడి రెండు గోల్స్ సాధించాడు లియోనెల్ మెస్సీ. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ రెండు గోల్స్ సాధించి... ‘గోల్డెన్ బాల్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు..

ఫిఫా వరల్డ్ కప్ విజయంతో అర్జెంటీనా అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెస్సీ ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మెస్సీ భార్య ఆంటోనీలా రొకుజో, సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకుంది...


Image Credit: Instagram

‘ఛాంపియన్స్... ఎలా మొదలెట్టాలో, ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో అర్థం చేసుకోగలను మెస్సీ... చివరి వరకూ పోరాటం వదలకూడదనే గొప్ప పాఠాన్ని మాకు నేర్పించినందుకు థ్యాంక్యూ.. నువ్వు ఇన్నేళ్లుగా దీని కోసం ఎంత కష్టపడ్డావో, దీన్ని పొందాలని ఎంత తపన పడ్డావో నాకు బాగా తెలుసు... లెట్స్ గో అర్జెంటీనా’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ఆంటోనీలా రొకుజో...

క్రికెటర్ల భార్యల మాదిరిగానే అర్జెంటీనా మ్యాచులు ఓడిన సమయాల్లో అభిమానుల నుంచి ట్రోలింగ్ ఫేస్ చేసింది మెస్సీ భార్య ఆంటోనీలా రొకుజో. 2018 ఫిఫా వరల్డ్ కప్ సమయంలో క్రొయేషియాతో మ్యాచ్‌లో 3-0 తేడాతో ఓడిన తర్వాత మెస్సీపై, అతని కుటుంబంపై సైబర్ దాడి చేశారు అభిమానులు... ఇప్పుడు అదే అభిమానులు మెస్సీని, ఆంటోనీలాని ఆకాశానికి ఎత్తుతుండడం విశేషం..

messi wife

మెస్సీకి చిన్ననాటి స్నేహితురాలైన ఆంటోనీలా రొకుజో, 2008 నుంచి అతనితో ఢేటింగ్ చేస్తోంది. ఈ ఇద్దరూ 2017లో వివాహం చేసుకున్నారు.  ఇక్కడ విశేషం ఏంటంటే పెళ్లికి ముందే మెస్సీ, ఆంటోనీలాలకు ఇద్దరు కొడుకులు పుట్టేశారు.

Image Credit: Instagram

పెళ్లాయ్యాక ఏడాదికి మరో అబ్బాయి జన్మించాడు.. ఈ ముగ్గురు కొడుకులతో మెస్సీ ఆడే ప్రతీ మ్యాచ్‌కి వచ్చి భర్తను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది మిసెస్ మెస్సీ.. మరో విశేషం ఏంటంటే ఆంటోనీలా కూడా ఫుట్‌బాల్ ప్లేయరే.. అయితే పెళ్లి తర్వాత కుటుంబం కోసం ఆటను పక్కనబెట్టేసింది...

Latest Videos

click me!