టీమిండియా కాదు.. ఇది గుర్తుపెట్టుకోండి.! ఈసారి టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాదే

Published : Feb 06, 2026, 07:30 AM IST

Australia: టీ20 వరల్డ్‌కప్ 2026లో ఆస్ట్రేలియా మరోసారి కప్పు గెలుస్తుందని చరిత్ర చెబుతోంది. ఐసీసీ టోర్నీల కంటే ముందు సిరీస్ ఓడిపోవడం.. వాళ్ల గేమ్ ప్లాన్ అని క్రికెట్ నిపుణులు అంటున్నారు. 

PREV
15
వరల్డ్ కప్ వస్తే ఆస్ట్రేలియా వేరే లెవల్

2026 టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మరోసారి పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగుతోంది. ప్రతీ ఐసీసీ టోర్నీ ముందు సిరీస్‌లు కోల్పోయినప్పటికీ.. ఐసీసీ టైటిల్స్ గెలుస్తోంది. మరి aa చరిత్ర ఏం చేబుతోందంటే..

25
ఆ సిరీస్ ఓటమి… కానీ ట్రోఫీ విజయం!

2007లో వరల్డ్ కప్‌కు ముందే సిరీస్ ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత కప్పు దక్కించుకుంది ఆస్ట్రేలియా. 2021 టీ20 వరల్డ్ కప్‌కు ముందు కూడా సిరీస్‌లో పరాజయం చూసిన ఆ జట్టు.. ప్రపంచకప్ టైటిల్ సాధించింది. అటు డబ్ల్యూటీసీ ఛాంపియన్ షిప్ ముందు కూడా సిరీస్ ఓడిపోయి.. ఫస్ట్ టైం ఆ ఛాంపియన్ షిప్ సాధించింది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ జట్టుతో సిరీస్ ఓడిపోయి.. టీ20 ప్రపంచకప్ 2026లోకి అడుగుపెడుతోంది.

35
గణాంకాలే చెబుతున్న అసలు నిజం..

ఆస్ట్రేలియా ప్రతీసారి ఐసీసీ ప్రపంచకప్‌లలో అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. టీ20 ఫార్మాట్‌లో కూడా గణనీయమైన విజయాలను సొంతం చేసుకుంది. ఒకసారి వరల్డ్ కప్‌లో అడుగుపెట్టారంటే.. కచ్చితంగా ఆ జట్టు ప్రదర్శన చావోరేవోలా ఉంటుంది. అలా పోరాడి విజయం సాధించిన రోజులు కూడా ఉన్నాయ్.

45
అనుభవం + మెంటాలిటీ = ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా జట్టు.. అటు కెప్టెన్సీ, అపార అనుభవం, ఆటగాళ్ల సామర్థ్యంతో బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో ఆ జట్టు.. ప్రత్యర్ధులతో పోటాపోటీగా ఉంది. కొన్ని మ్యాచ్‌ల్లో, సిరీస్‌ల్లో పరాజయాలు చవిచూసినా.. మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తున్నారు.

55
2026లో చరిత్ర మళ్లీ రిపీట్ అవుతుందా?

ఒకసారి ప్రపంచకప్ బరిలోకి దిగితే కచ్చితంగా ఆస్ట్రేలియా మిగిలిన జట్లకు గట్టి పోటీనిస్తుంది. అయితే కీలక ఆటగాళ్లు టైంకు జట్టుతో కలవకపోవడం, ఫిట్‌నెస్ ఇబ్బందులు లాంటివి ఈ 2026 టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాను సతమతం అయ్యేలా చేస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories