Jr NTR: దర్శకుడు అనిల్ రావిపూడి జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా అవకాశం మిస్సవడం, కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో తనకెలా జీవితాన్నిచ్చారో వివరించాడు. తన డ్రీమ్ ప్రాజెక్టులు, అన్ని స్టార్ హీరోలతో పనిచేయాలనే కోరిక లాంటి విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో సంక్రాంతికి హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, స్టార్ హీరోలతో అనుభవాలు, డ్రీమ్ ప్రాజెక్టులపై కీలక విషయాలు పంచుకున్నాడు. తన కెరీర్‌కు పునాది వేసిన పటాస్ సినిమా.. కళ్యాణ్ రామ్ తనపై పెట్టి నమ్మకాన్ని గుర్తు చేసుకున్నాడు.
25
పటాస్ సినిమా తన అడ్రస్..
పటాస్ సినిమా తన అడ్రస్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి పేర్కొన్నాడు. ఆ సమయంలో కళ్యాణ్ రామ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, తనను నమ్మి సినిమా తీయడానికి ముందుకు వచ్చారని తెలిపాడు. కళ్యాణ్ రామ్ ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే, ఈరోజు సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు లాంటి సినిమాలు ఉండేవి కాదని, అందుకే కళ్యాణ్ రామ్‌కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని అనిల్ స్పష్టం చేశాడు.
35
తారక్‌కు కథ చెప్పా..
రాజా ది గ్రేట్ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌ను కలిసి ఓ పాయింట్ చెప్పాను. అది ఎన్టీఆర్‌కు బాగా నచ్చి, గంటన్నర నేరేషన్ చెప్పమన్నారు. అయితే అప్పుడు సమయం లేకపోవడంతో ఆ అవకాశం కోల్పోవాల్సి వచ్చిందని అన్నాడు. అదే సమయంలో బాబీ దర్శకత్వంలో 'జై లవకుశ'కు ఎన్టీఆర్ ఓకే చెప్పడం జరిగింది. భవిష్యత్తులో మంచి కథతో వెళితే ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అందరి స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనేది తన కోరిక అని అనిల్ రావిపూడి తెలిపాడు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలతో పనిచేయాలని ఉందని చెప్పాడు. బఫెట్‌లో అన్ని రకాల వంటకాలు రుచి చూసినట్లు, తన కడుపు నిండే వరకు అందరి హీరోలతో సినిమాలు చేయాలని ఉందని సరదాగా చెప్పుకొచ్చాడు.
55
డ్రీమ్ ప్రాజెక్టులు..
డ్రీమ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ఆదిత్య 369 లాంటి ఒక ఫిక్షన్ సినిమాను, అలాగే రామాయణం లేదా మహాభారతం లాంటి ఒక పౌరాణిక చిత్రాన్ని డైరెక్ట్ చేయాలని తనకు కోరిక ఉందని, సరైన స్థాయి వచ్చినప్పుడు వాటిని తప్పకుండా చేస్తానని అనిల్ రావిపూడి అన్నారు.