హిందూ పురాణంలో గరుడ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గరుడ పురుణాన్ని అనుసరించి మనుషులు పొరపాటున కూడా కొన్ని పొరపాట్లు చేయకూడదట. ఒకవేళ తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తే.. జీవితంలో వారికి శాంతి అనేది లభించదు. అంతేకాదు.. ఎంత సంపాదించినా, ధనవంతులు అయినా.. చివరకు పేదరికంలో మునిగిపోవాల్సిందేనట.
గరుడ పురాణం ప్రకారం.. ఎలాంటి తప్పులు, పొరపాట్లు చేయకూడదో, ఎలాంటి పొరపాట్లు చేస్తే.. డబ్బంతా పోయి పేదవారిగా మిగిలిపోతారో చూద్దాం..
ఒక మనిషి అనేవాడు తన జీవితంలో కచ్చితంగా దానధర్మాలు చేయాలట. దానధర్మమే ప్రతి మనిషి మతం. దానం చేయకపోతే సమస్యలు పెరుగుతాయి. అలాగే ధనవంతుడు కూడా పేదవాడు అవుతాడని గరుడ పురాణం చెబుతోంది.
దానం చేసిన వ్యక్తి వద్ద మాత్రం డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదట. చేయని వ్యక్తులకు సంపాదించినది కోల్పోవడమే కాగా.... ఆందోళన కూడా నిత్యం వారిని వెంటాడుతూనే ఉంటుందట.
గరుడ పురాణం ప్రకారం.. ధనవంతుడు ఇంకెప్పుడూ లోపభూయిష్టంగా లేదా లోభిలాగా ప్రవర్తించకూడదని చెబుతోంది. ఎందుకంటే అలా ప్రవర్తిస్తే.. ఎంత ధనవంతుడైనా ఏదో ఒక నాడు పేదవాడిగా మారిపోతాడట.
అంతే కాదు, డబ్బు విషయంలో అహం ఎక్కువగా ఉండే వ్యక్తికి ఎప్పటికీ డబ్బు ఉండదని అంటారు. అలాంటి వారిపై లక్ష్మీదేవికి కోపం వస్తుందని, వారి దగ్గర లక్ష్మీదేవి ఉండటానికి కూడా ఇష్టపడదట.
గరుడ పురాణం ప్రకారం డబ్బుపై దురాశతో మరొకరిని మోసం చేసే వ్యక్తి ఎప్పుడూ సమస్యలతో బాధపడుతుంటాడు. కాబట్టి ఎవ్వరూ ఎవరినీ డబ్బుతో మోసం చేయకూడదు.