పక్కా ప్లాన్: ఎన్నికల్లో వైఎస్ షర్మిల పోటీకి స్థానాలు ఇవీ....

First Published | Mar 13, 2021, 6:14 PM IST

షర్మిల తాను 2023లో ఎక్కడినుండి పోటీచేయాలని విషయంలో కూడా క్లారిటీ తెచుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె తన సన్నిహితులు, కొందరు సీనియర్ నేతలు, రాజశేఖర్ రెడ్డి అభిమానులతో చర్చించిన మీదట మాజీ దివంగత మంత్రి నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అది కాకపోతే గ్రేటర్ పరిధిలోని మరో నియోజకవర్గాన్ని ఆమె ఎంచుకోనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో పార్టీని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. తెలంగాణ కోడలిని అంటూ ఆమె ఇక్కడి రాజకీయాల్లో చక్రం తిప్పాలని యోచిస్తున్నారు. రాజన్న రాజ్యం అనే కాన్సెప్ట్ ను తెర మీదకు తీసుకురావడం ద్వారా.... అధికార తెరాస లోపాలను ఎత్తిచూపడమే కాకుండా ఆమె ఏమి చేయదల్చుకున్నారో కూడా ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. షర్మిల ఇంతకు ఎవరు వదిలిన బాణం అనే విషయంలో క్లారిటీ రాక అందరూ తలలు పట్టుకుంటుంటే... ఆమె మాత్రం పార్టీ ఏర్పాటు, విస్తరణ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
undefined
షర్మిల తెలంగాణాలో 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్టుగా కనబడుతుంది. ఆమె వరుసగా నాయకులను కలుస్తుండడం, పార్టీలోకి సీనియర్లను ఆహ్వానిస్తుండడం, లోటస్ పాండ్ వద్ద రోజూ ఏదో ఒక హడావుడి ఉండేలా ప్లాన్ చేస్తూ పార్టీ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నడుస్తున్నాయన్న సంకేతాలను ఇస్తున్నారు.
undefined

Latest Videos


పనిలో పనిగా షర్మిల తాను 2023లో ఎక్కడినుండి పోటీచేయాలని విషయంలో కూడా క్లారిటీ తెచుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె తన సన్నిహితులు, కొందరు సీనియర్ నేతలు, రాజశేఖర్ రెడ్డి అభిమానులతో చర్చించిన మీదట మాజీ దివంగత మంత్రి నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అది కాకపోతే గ్రేటర్ పరిధిలోని మరో నియోజకవర్గాన్ని ఆమె ఎంచుకోనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ రెండు నియోజకవర్గాలను షర్మిల ఎంచుకోవడం వెనుక భారీ గ్రౌండ్ వర్క్ చేసినట్టుగా చెబుతున్నారు. అసలు ఆ రెండు నియోజకవర్గాలు ఏమిటో ఒకసారి చూద్దాము.
undefined
కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన దివంగన నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన పాలేరు నియోజకవర్గాన్ని షర్మిల తొలి ప్రాధాన్యతగా ఎంచుకున్నట్టు సమాచారం. ఈ నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంది. ఆంధ్ర ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉండే... ఈ నియోజికవర్గమైతే... అన్నివిధాలా తనకు అనుకూలిస్తుందని ఆమె భావిస్తున్నారు.
undefined
ఈ నియోజికవర్గమైతే... రాజశేఖర్ రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో ఉండడమే కాకుండా... ఖమ్మం పార్లమెంటు సీటును గతంలో వైసీపీ నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ సులువుగా గెలుపును చేజిక్కించుకోవచ్చని షర్మిల యోచిస్తున్నారు.
undefined
ఇక షర్మిల మొగ్గుచూపుతున్న రెండవ సీటు సికింద్రాబాద్ నియోజకవర్గం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అధికంగా ఉన్న క్రిస్టియన్ మైనారిటీ ఓట్లను ఆమె టార్గెట్ చేసుకొని ఈ నియోజికవర్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. ఇదే నియోజకవర్గం నుంచి 2009లో జయసుధ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం కూడా తెలిసిందే. ఈ ఈక్వేషన్ ని దృష్టిలో ఉంచుకునే షర్మిల సికింద్రాబాద్ నియోజకవర్గం వైపుగా మొగ్గు చూపుతున్నట్టు వినికిడి. రెడ్డి, క్రిస్టియన్ మైనారిటీ ఓట్ల మీద అధికంగా ఆశలు పెట్టుకొని 2023 ఎన్నికల్లో చక్రం తిప్పుదామనుకుంటున్న షర్మిల ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో వేచి చూడాలి..!
undefined
click me!