ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది. ఆయన పార్టీలోనే ఉంటూ.... ఒక్క అధినేత జగన్ మోహన్ రెడ్డి మీద తప్ప వేరే ఎవ్వరిని వదలకుండా అందరి మీద విమర్శలు గుప్పిస్తున్నారు.
undefined
గతంలో కూడా మాట్లాడినప్పటికీ.... ఈదఫా మాత్రంతొలుత టీటీడీ భూముల వ్యవహారంలో వైసీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన రఘురామకృష్ణంరాజు... ఆ తరువాత ఇసుక, అవినీతి అంటూ గళమెత్తారు. ఇక ఆయనకు కౌంటర్ ఇస్తూ వైసీపీ నేతలు ముందుకొచ్చారు.
undefined
తనను ఒక్కటంటే... ఆయన రెండంటున్నారు. తనకు సవాలు విసిరితే ప్రతి సవాలు విసురుతున్నారు. వైసీపీ నేతలంతా మంత్రుల తోసహా రఘురామా కృష్ణంరాజుపై ఒక మినీ యుద్ధానికి పూనుకున్నారు. ఏకంగా తనను కాళ్లావేళ్లా బ్రతిమిలాడితే తాను వైసీపీలో చేరానని, తాను కాబట్టే నరసాపురం సెగ్మెంట్ లో వైసీపీ విజయదుందుభి మోగించిందని అన్నారు.
undefined
ఇక అక్కడితో ఆగకుండా వైసీపీవారు బహిష్కరించిన కొన్ని టీవీ చానెళ్లలో చర్చలకు హాజరవుతూ....నన్ను బహిష్కరించండి అని ఆయన ప్రయత్నం చేస్తుంటే... ఆయన్నే రాజీనామా చేసేలా చెయ్యాలి అని వైసీపీ వర్గం ఎత్తులు వేస్తుంది. ఏది ఏమైనా నరసాపురం, గోదావరి జిలాల్ల నాయకుడు రఘురామ కృష్ణం రాజు ఇమేజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది .
undefined
ఆయన మీద ఆయన సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తూ, ఆయనకు సవాళ్లు విసురుతుంటే.... ఆయన కూడా రెండాకులు ఎక్కువే చదివినట్టున్నాడు, వారిపై తీవ్రంగా ఫైర్ అవుతున్నాడు. ఈ గొడవల మధ్యలో పార్టీ అంతర్గత వ్యవహారాలు బయటపడుతున్నాయి. ఈ చర్చల వల్లే కొట్టు సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలను మీడియా ముఖంగా చేసారు రఘురామా.
undefined
ఈ పరిస్థితిని చూస్తుంటే...టీడీపీకి అంటి ముట్టనట్టుగా ఉంటూ, టీడీపీ మీద విరుచుకుపడుతున్న టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు గుర్తుకురావడం తథ్యం. నిన్న రాజ్యసభ ఎన్నికల్లో కూడా వారంతా టీడీపీ విప్ జారీ చేస్తే వచ్చారు, కానీ చెల్లకుండా వోట్ వేశారు.
undefined
ఇక ఆ తరువాత మళ్లీ యథాప్రకారంగా నాకు విప్ ఇచ్చేన్తా మొగుడా అంటూ విరుచుకుపడ్డారు. వీరంతా పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా, పార్టీలోనే ఉంటూ సొంతపార్టీపై విరుచుకుపడుతున్నారు.
undefined
వీరందరిలో కనీసం వల్లభనేని వంశినైనా సూత్రప్రాయంగా బహిష్కరిస్తామని టీడీపీచెప్పింది. మిగిలిన మద్దాలి గిరి, కారణం బలరాం లు అయితే... ఇంకా అధికారికంగా పార్టీలో కొనసాగుతున్నవారే. వారు ఒకరకంగా చెప్పాలంటే... వైసీపీ కండువాతో టీడీపీ సీట్లలో కూర్చున్నారాని అనవచ్చు.
undefined
జగన్ తమ పార్టీలోకి రావాలంటే... పదవికి రాజీనామా చేసి రావాలి అని చెప్పారు. వారంతా వైసీపీ ఖండువా కప్పుకొని జగన్ దగ్గర వైసీపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ... టెక్నికల్ గా వారంతా ఇంకా టీడీపీలో కొనసాగుతున్నవారే.
undefined
టీడీపీ రెబెల్స్టెక్నికల్ గా టీడీపీ, మాట్లాడేది వైసీపీ తరుపున తిట్టేది టీడీపీ పార్టీని, టీడీపీ అధినేత చంద్రబాబుని. ఇక్కడ రఘురామకృష్ణంరాజు కూడా అచ్చం ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఆయన ఉండేది వైసీపీ, ఒకరకంగా పాడేది బీజేపీ పాట, తిట్టేది వైసీపీ నాయకులను.
undefined
ఎత్తులు పై ఎత్తుల మధ్య మండలిలో మూడు రాజధానుల బిల్లు చర్చకు రాకుండా పోయింది. మూడు రాజధానుల బిల్లును అటుంచితే... ద్రవ్య వినిమయ బిల్లు కూడా పాస్ అవలేదు. ఎందుకు కాలేదు, దానికి టీడీపీ, వైసీపీ చెప్పిన కారణాలను పక్కకుంచితే.... మండలి విషయంలో జగన్ మెత్తబడ్డారాఅనే అనుమానం మాత్రం కలుగక మానదు.
undefined
ఇటు రఘురామ కానీ అటు టీడీపీ రెబెల్స్ కానీ తమ పార్టీ బహిష్కరిస్తే బాగుండును అని ఎదురుచూస్తున్నారు. వారిపార్టీలేమో.... వీరంతటవీరుగా వెళ్ళిపోతే బాగుండు అని ఎదురుచూస్తున్నారు.
undefined
ఏది ఏమైనా ఇరు పార్టీలకు వీరి వల్ల జరగాల్సిన నష్టమైతే జరుగుతూనే ఉంది. రఘురామ వల్ల అతడు హీరో అవడంతోపాటుగా గోదావరి జిల్లాల నాయకుడు కాస్తా రాష్ట్ర స్థాయి నాయకుడు అయిపోయాడు. దానితోపాటుగా అతడికి ఇప్పుడు బీజేపీ అధినాయకత్వంతో దగ్గరి సంబంధాలున్నాయని ప్రచారంతో వైసీపీ నాయకులు తరువాత ఎవరైనా పార్టీలో ఇమడలేకపోయినప్పుడు వారికి బీజేపీ రూపంలో ఒక ఆలంబన కనిపించే ఆస్కారం ఉంది.
undefined