వేడెక్కిన ఏపీ రాజకీయాలు: మంత్రి పదవుల భర్తీ జగన్ కు కత్తి మీద సామే

First Published | Jul 13, 2020, 6:18 PM IST

అధికార వైసీపీలోని నేతలంతా ఆషాఢమాసం ఎప్పుడు వెళ్లిపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఆషాఢమాసం వెళ్ళిపోగానే వైసీపీ ఖాళీయైన మంత్రిపదవులు, ఎమ్మెల్సీ పదవులను నింపనుండటమే ఇందుకు కారణం. ఇప్పుడు వైసీపీ నేతలంతా ఈ భర్తీలపై చాలా ఆశలే పెట్టుకున్నారు. 

ఎన్నికలు దరిదాపుల్లో లేకున్నప్పటికీ... ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జెండా పాతాలనిచూస్తున్న జనసేన, బీజేపీ ఇలా ఎవరికీ వారు తమ రాజకీయ వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతూ.... రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా వేడెక్కించాయి.
undefined
అధికార వైసీపీలోని నేతలంతా ఆషాఢమాసం ఎప్పుడు వెళ్లిపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఆషాఢమాసం వెళ్ళిపోగానే వైసీపీ ఖాళీయైన మంత్రిపదవులు, ఎమ్మెల్సీ పదవులను నింపనుండటమేఇందుకు కారణం. ఇప్పుడు వైసీపీ నేతలంతా ఈ భర్తీలపై చాలా ఆశలే పెట్టుకున్నారు.
undefined

Latest Videos


పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలు ఇద్దరి ఇప్పుడు రాజ్యసభకు వెళ్లడంతో... వారి ఎమ్మెల్సీ, మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. ఈ రెండు ఎమ్మెల్సీ ఖాళీలతోపాటుగా మరో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అవుతున్నాయి.
undefined
సో, మొత్తం నాలుగుఎమ్మెల్సీ, రెండు మంత్రిపదవులను ఇప్పుడు జగన్ నింపనుండటంతో.... ఆశావాహులంతా తమ ముమ్మర ప్రయాత్నాలు చేయడం మొదలుపెట్టారు. వీటితోపాటుగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా నింపనున్నారన్న సమాచారంతోశ్రావణమాసంకై వైసీపీ నేతల ఎదురుచూపులు మొదలయ్యాయి.
undefined
ఇక మంత్రి పదవుల విషయానికి వస్తే ఇద్దరు బీసీ నేతలే కావడంతో... బీసీలతోనే నింపాలని జగన్ యోచిస్తున్నారు. సామాజికవర్గాల ఆధారంగా గతంలో విస్తరించిన మంత్రివర్గ కూర్పుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామాజికవర్గాల ఆధారంగా కూర్పు అలానే ఉంచాలని జగన్ యోచిస్తున్నారు.
undefined
అచ్చెన్నాయుడు అరెస్ట్ మొదలుటీడీపీ పదే పదే బీసీ వ్యతిరేకిగా వైసీపీ పనిచేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఇద్దరు మంత్రుల ప్లేస్ లో మరల బీసీ సామాజికవర్గ ఎమ్మెల్యేలనే నింపాలని యోచిస్తున్నారు.
undefined
జోగి రమేశ్‌ (పెడన),పొన్నాడ సతీశ్‌కుమార్‌ (ముమ్మడివరం), చెల్లుబోయిన్‌ వేణుగోపాల్‌ (రామచంద్రపురం), సీదిరి అప్పలరాజు(పలాస), కొలుసు పార్థసారథి (పెనమలూరు) వంటి బీసీ నేతలు ఈ మంత్రి పదవులకు పోటీ పడుతున్నారు. జోగి రమేష్ కి దాదాపుగా మంత్రి పదవి ఖాయం అని వినబడుతున్నాయి.
undefined
ఈ మంత్రి పదవులు బీసీ నేతలకే ఇస్తుండడంతో మిగిలిన సామాజికవర్గాలు చెందిన ఆశావహులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈసారి నింపే మంత్రివర్యుల పదవులు కేవలం ఒకటిన్నర సంవత్సరం మాత్రమే కదా అని వారికివారే నచ్చచెప్పుకుంటున్నారట.
undefined
ఇక ఎమ్మెల్సీల విషయానికి వస్తే చిలకలూరిపేట నుంచి 2019లో టికెట్ దక్కించుకోలేకపోయిన మర్రి రాజశేఖర్ కి ఒక సీటు కంఫర్మ్ అని పెద్దలు మాటిచ్చినట్టు తెలియవస్తుంది.
undefined
ఆఖరు నిమిషంలో టీడీపీ నుంచి వచ్చి చేరిన విడదల రజని కి టికెట్ ఇవ్వడంతో మొదటినుండి ఈ స్థానానికిఅనుకున్న మర్రి రాజశేఖర్ ను పక్కనపెట్టారు. మర్రి రాజశేఖర్ కి స్థానికంగా విడదల రజిని ఇబ్బందులు సృష్టిస్తున్నట్టు పలుమార్లు వార్తలు వచ్చాయి.
undefined
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ను విడదల రజిని వర్గీయులు మొన్న చిలకలూరిపేటలో అడ్డుకోవడానికి కారణం.....ఆయన రాజశేఖర్ జన్మదినోత్సవ వేడుకలకు హాజరవ్వడానికి రావడమే అని అంటున్నారు.
undefined
ఆయన బర్త్ డే ఫ్లెక్సీలను మునిసిపల్ సిబ్బంది తొలిగించడం, దానివెనుక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ ఆయన ఆరోపిస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం దానితో వారు ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న హామీ ఇచ్చారట. కానీ ఇంతవరకు ఈ విషయంపై స్పష్టత రాలేదు.
undefined
ఇక మరో పదవిని కడపకు చెందిన ఒక మైనారిటీ నేతకు ఇస్తారని ప్రచారం సాగుతుంది. మరో ఎమ్మెల్సీని ఎస్సి సామాజికవర్గానికి కేటాయించాలని జగన్ తలస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇదే నెలలో మంత్రివర్గ విస్తరణకు ముందేఒక ప్రకటన రానున్నట్టు సమాచారం.
undefined
పార్టీలో అసంతృప్తులు జోరుగా ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దా రెడ్లలో ఈ అసంతృప్తి అధికంగా ఉంది. మొన్నఆనం రామనారాయణ రెడ్డి రఘురామకృష్ణంరాజుతో దిగినసెల్ఫీ ఇప్పుడు కాక రేపుతోంది.
undefined
ఈ అన్ని పరిస్థితులకు తోడు జిల్లాల విభజన ఉండనే ఉంది. జిల్లాల విభజన వల్ల మరికొంత అసంతృప్తి సిద్ధంగా ఉండనే ఉంది. కాచుకొని కూర్చున్న బీజేపీ ఎవరు తమ పార్టీలోకి వచ్చినా చేర్చుకుందామనే ఉద్దేశంలో ఉన్నారు. చూడబోతుంటే జగన్ కి ఈ పదవుల పంపకంకత్తి మీద సాములాగానే కనబడుతుంది.
undefined
click me!