చంద్రబాబుతోనే మేమంతా...పోరాటంలో తోడుంటాం..:కెనడాలో ప్రవాసీల భారీ నిరసన

First Published | Sep 21, 2023, 1:32 PM IST

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు వ్యతిరేకంగా కెనడాలోని టొరంటో పట్టణంలో ప్రవాసీయులు నిరసన చేపట్టారు. 

Canada


టొరంటో : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ ను టిడిపి నాయకులు ఖండిస్తుండగా వైసిపి ప్రభుత్వం, నాయకులు మాత్రం సమర్ధిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ టిడిపి ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజూ ఏదోఒక రూపంలో నిరసన తెలియజేపస్తున్నారు. 

Canada

కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు పొరుగు రాష్ట్రాలు, చివరకు విదేశాల్లోనూ చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా కెనడాలో స్థిరపడిన తెలుగువారు చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు.  సెంట్రల్ టోరంటో నగరంలో దాదాపు 500 మంది తెలుగుదేశం పార్టీ జెండాలు, చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. 


Canada

ఇరు తెలుగు రాష్ట్రాలకు (ఏపీ, తెలంగాణ) చెందినవారు చంద్రబాబుతో వుంటామంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తే టోరంటోలో నిరసనకు దిగారు. ఇలా చంద్రబాబుకు మద్దతుగా వివిధ రకాలుగా నిరసన తెలిపారు. కొందరు మహిళలు చిన్నారులను సైతం తీసుకువచ్చి ఈ నిరసనలో పాల్గొన్నారు. 

Canada

ఇటీవల ఇలాగే అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ తెలుగు ప్రజలు నిరసనలు చేపట్టారు. న్యూజెర్సీలో టిడిపితో పాటు జనసేన జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. తాము ఇలా విదేశాల్లో స్థిరపడగానికి కారణం చంద్రబాబేనని... ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే చూస్తూ వుండలేకపోతున్నామని ప్రవాసులు అంటున్నారు. అందవల్లే దేశం కాని దేశంలో నిరసనకు దిగినట్లు ప్రవాసులు చెబుతున్నారు. 

Canada

ఇక హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఐటీ రంగం ఇంతలా అభివృద్ది చెందడానికి చంద్రబాబే కారణమని... అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం తమనెంతో కలచివేస్తోందని అన్నారు. ఇలా చంద్రబాబుకు మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

Canada

ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాతి పరిణామాలపై టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి వస్తున్నారు. టిడిపి కూడా వివిధ రూపాల్లో ఆందోళనలకు పిలుపునిస్తోంది. 

Latest Videos

click me!