ఆస్ట్రేలియాలో బోనాల పండుగలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

First Published | Jul 15, 2023, 7:04 PM IST

భారత జాగృతి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అంతకుముందు సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాలకు చెందిన భారత జాగృతి నేతలు కవితకు స్వాగతం పలికారు. 

kavitha

భారత జాగృతి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బోనాన్ని తీసుకెళ్లే కలశాన్ని అలంకరించారు కవిత. 

kavitha

కల్వకుంట్ల కవిత రాక విషయం తెలుసుకున్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, బ్రిస్బేన్‌ తదితర ప్రాంతాలకు చెందిన భారత జాగృతి నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. 


kavitha

ఇటీవల సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో కవిత పాల్గొన్నారు. బంగారు బోనంతో ఆలయానికి చేరుకున్న కవిత ఆలయ అధికారులు , అర్చకులు స్వాగతం పలికారు. 

kavitha

జూలై 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో భారత జాగృతి ఆస్ట్రేలియాశాఖ ఆధ్వర్యంలో, 16న న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో తెలంగాణ సెంట్రల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బోనాల వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు. 

kavitha

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు స్థిరపడిన ప్రతి ప్రాంతంలోనూ బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. ఎన్ఆర్ఐ సంఘాలు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాయి. 

kavitha

ఇక బోనాల పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Latest Videos

click me!