టెక్నో థ్రిల్లర్‌ : 'కీచురాళ్లు' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!

First Published | Jun 3, 2024, 2:49 PM IST

అమ్మాయిల నెంబర్ దొరికితే చాలు ఇక వారిని ఇబ్బంది పెట్టే పని పెట్టుకుంటారు కొందరు  . అలాంటి వాటిని చాలా సహజసిద్ధంగా చూపించాడు దర్శకుడు. కథని గ్రిప్పింగ్ గా చూపిస్తూ సాగే సీన్లు ఆకట్టుకుంటాయి. 

Keechurallu Review


టెక్నాలిజీ పెరిగిపోయాక నేరాలు రూపం మార్చుకున్నాయి. అయితే ఆ నేరాలను అరికట్టడానికి అదే స్దాయిలో టెక్నాలజీ వాడే దమ్ము,ధైర్యం ఉండాలి. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు అన్ నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ చేయటం, ఇబ్బంది పెట్టడం కామన్ అయ్యిపోయింది. ఆ నెంబర్ గల వ్యక్తులను పట్టుకోవటం కోసం చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పట్టుకున్నా చాలా వరకూ కేసులు నిలబడటం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి. పోలీసులు వలన ఉపయోగం ఉంటోందా ఈ విషయాలను అంతర్లీనంగా చర్చిస్తూ ఓ రేసీ థ్రిల్లర్ గా వచ్చిందీ చిత్రం. ఈ సినిమాలో కథేంటి, చూడదగ్గదేనా చూద్దాం.


స్టోరీ లైన్ 
రాధిక(రజీషా విజయన్) సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. ఎథికల్ హ్యాకర్.  అయితే ఆమె వాటిని మంచి పనులుకే ఉపయోగిస్తూంటుంది. సైబర్ క్రైమ్ కి సంబంధించిన కొన్ని కేసులను పరిష్కరించడానికి పోలీస్ డిపార్టుమెంటు సైతం ఆమె సాయిం తీసుకుంటుంది. తల్లి లేని ఆమె తన తండ్రి  సీనియర్ లాయర్ (శ్రీనివాసన్) తో కలిసి ఉంటూంటుంది. ఆమెకు  పెళ్లి చేయాలని ఆ తండ్రి తపిస్తూంటాడు. కానీ ఆమె సెకన్లులలో అవతలి వాళ్ల డేటాని ఎనాలసిస్ చేసి నో చెప్పేస్తూంటుంది. ఇలా నడుస్తున్న సమయంలో ఆమె జీవితంలో ఓ ఫోన్ కాల్ తో మలుపు తిరుగుతుంది.
 


keedam teaser


ఒక రోజున ఆమె ఫ్రిజ్ రిపేర్ కిఅవసరమై ఒక నెంబర్ కి కాల్ చేస్తుంది. అవతల వ్యక్తి బంగారం అంటూ  కాస్త అసభ్యంగా మాట్లాడటంతో కాల్ కట్ చేస్తుంది. ఫోన్లో ఆమెతో అలా మాట్లాడిన ఆ వ్యక్తిపేరు కిలి బిజూ. అతను లోకల్ మాఫియా ముఠాకి సంబంధించిన  గ్యాంగులో ఒకడు. ఆ గ్యాంగ్ లో మొత్తం ఐదుగురు ఉంటారు. పైకి స్క్రాప్ బిజినెస్ చేస్తున్నట్టుగా అక్కడి వాళ్లను నమ్మిస్తూ మాఫియాకు పనిచేస్తూ అవసరమైతే మర్డర్స్ చేస్తూంటారు. ఇక ఈ కిలి బిజూ  రాధిక కట్ చేసినా ఆమె వాయిస్ నచ్చడంతో, ఫేస్ బుక్ లోకి వెళ్లి ఆమె ఎలా ఉందనేది చూస్తారు. 

keedam first look


దాంతో ఆమె అందంగా  కనిపించడంతో.. నెంబర్స్ మార్చుతూ తరచూ కాల్స్ చేస్తూంటాడు. వాట్సప్ లో ఆమెకు ఫోర్స్ వీడియోలు పంపుతాడు. ఈ వేధింపులతో ఆమె పోలీసులను ఆశ్రయిస్తుంది.  ఆమెతోను, ఆమె తండ్రితోనూ ఉన్న పరిచయంతో పోలీస్ ఆఫీసర్ ఛార్లెస్ , అష్రఫ్ ఇద్దరు   స్పందిస్తారు. మొదట  ఆ రౌడీ గ్యాంగ్ ను పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. కేసులు, కోర్టులు వద్దంటారు. కానీ అలా వార్నింగ్ ఇవ్వటంతో  ఆ రౌడీలు మరింత రెచ్చిపోతారు. రాధికను, ఆమె తండ్రిని ఫాలో అవుతూ వేధించడం మొదలుపెడతారు. 


దాంతో రాథిక ఓ నిర్ణయానికి వస్తుంది.  తన సైబర్ సెక్యూరిటీ తెలివిని ఉపయోగించి దెబ్బ కొట్టాలనుకుంటుంది. ఆ క్రమంలో వాళ్ల ఫోన్స్ హ్యాక్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు వాళ్ల గురించిన కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. వాళ్ల వెనక పెద్ద నెట్ వర్క్ ఉందని తెలుసుకుంటుంది. అక్కడ నుంచి ఆమె ఏం చేసింది. వాళ్లకు ఎలా బుద్ది చెప్పింది. వాళ్లు ఊరుకున్నారా..ఎలా రెస్పాండ్ అయ్యారు. వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  


ఎలా ఉందంటే...


మలయాళంలో సక్సెస్ అయ్యిన ‘కీడం’ (Keedam)కు డబ్బింగ్‌ ఇది. రజీషా విజయన్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు రాహుల్‌ రిజీ నాయర్‌ తెరకెక్కించిన ఈ సినిమా థ్రిల్లింగ్  గా బాగా డిజైన్ చేసారనే చెప్పాలి.  టెక్నికల్ గా ప్రపచం మారిపోయింది. హ్యాకింగ్, సైబర్ ఎటాక్ వంటి విషయాలు ను ఈ సినిమా ఈ కథను అడ్డం పెట్టి మనకు చెప్పే ప్రయత్నం చేస్తారు.  సైబర్ ఎటాక్ లు... బ్యాంకు ఖాతాలు, సామాజిక మాధ్యమాలు, వివిధ కంపెనీలకు సంబంధించిన వినియోగదారుల డేటాను కూర్చొన్న చోటు నుంచి కదలకుండా  ఎలా  హ్యాక్‌ చేస్తున్నారో తెలుస్తుంది.  సైబర్‌క్రైమ్‌కు సంబంధించి   చట్టాలు కొంత చెప్పారు.    తెరపై ఆ మేజిక్‌ను క్రియేట్‌ చేయటంలో బాగానే సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సైబర్‌క్రైమ్‌ అనే సబ్జెక్ట్‌ అనంతం. తవ్వేకొద్దీ కొన్ని వందల, వేల కేసులు బయటపడతాయి. ప్రతి కేసూ ఆసక్తికరమే. 
 

keedam sneak peek

అయితే, ఏ పాయింట్‌ను ఎంత ఆసక్తికరంగా చూపించారన్న దానిపై సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అయితే, దర్శకుడు వాటి జోలికి పోకుండా  ఈ చిత్రాన్ని టెక్నో థ్రిల్లర్  డ్రామాగా చూపించే ప్రయత్నం చేశాడు. ప్రారంభంలో అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే పట్టినా ఆ తర్వాత కథనం పరుగెట్టింది. సెకండాఫ్ లో సీన్స్  మంచి ఇంటెన్స్ తో మలిచారు.  మన సమాజంలో అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల నుండి, వారిని అసభ్యంగా చూసే అబ్బాయిల నుండి ఇన్ స్పైర్ చేసుకొని దర్శకుడు రాహుల్ రిజి నయ్యర్ రాసుకున్నాడు. దర్శకుడు పాటలు, ఫైట్లు, భారీ సెట్లు అంటూ ఏ హంగు ఆర్భాటం లేకుండా తను చెప్పాలనుకున్న దానిని సూటిగా చెప్పేశాడు.

keedam teaser


టెక్నికల్  విషయానికొస్తే..

రాకేశ్ ధరన్ సినిమాటోగ్రఫీ బాగుంది‌. సిద్ధార్థ్ ప్రదీప్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. క్రిష్టి సెబాష్టియన్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.లెంగ్త్ తక్కువ కావటంతో అప్పుడే అయ్యిపోయిందా అనిపించింది. ఎక్కడా ల్యాగ్ అనిపించలేదు.  రియాల్టికి దగ్గరగా సీన్స్ ,ఫైట్స్ అన్ని జాగ్రత్తగా చూసకుని తెరకెక్కించాడు డైరక్టర్. నటీనటుల్లో   రజీషా విజయన్‌ యాప్ట్ గా చేసుకొచ్చింది. శ్రీనివాసన్ వంటి సీనియర్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అలాగే ఈ సినిమా డైరక్టర్ రాహుల్‌ రిజీ నాయర్‌  ..హీరోయిన్ కోలిగ్ గా కనిపిస్తారు. 

keedam first look

ఫైనల్ టాక్

ఇలాంటి సినిమాలు తెలుగులో  రావాల్సిన అవసరం ఉంది. అమ్మాయిలు ఖచ్చితంగా చూడాల్సిన  సినిమా ఇది. 
 
Rating:2.75

ఎక్కడ చూడచ్చు

ఈటీవి విన్ ఓటిటిలో తెలుగులో ఉంది. 

Latest Videos

click me!