'చాణక్య' రివ్యూ..!

First Published | Oct 5, 2019, 2:17 PM IST

అప్పట్లో కృష్ణ నటించిన గూఢచారి సినిమాలు తెగ వచ్చేవి. ఆ తర్వాత చిరంజీవి వంటి స్టార్స్ ఒకటీ , అరా అలాంటి సినిమాలు చేసినా, సక్సెస్ రేటు తక్కువ ఉండటంతో వాటి జోలికిపోలేదు. 

(Review By --సూర్య ప్రకాష్ జోశ్యుల) అప్పట్లో కృష్ణ నటించిన గూఢచారి సినిమాలు తెగ వచ్చేవి. ఆ తర్వాత చిరంజీవి వంటి స్టార్స్ ఒకటీ , అరా అలాంటి సినిమాలు చేసినా, సక్సెస్ రేటు తక్కువ ఉండటంతో వాటి జోలికిపోలేదు. దాంతో జనరేషన్ తో పాటు ఆ తరహా సినిమాలు మాయిం అయ్యిపోయాయి. అయితే బాలీవుడ్ అప్పుడప్పుడూ వాటిని టచ్ చేస్తోంది. ఆ ప్రేరణతోనేమో గోపీచంద్ సైతం ఇలాంటి సినిమా ఒకటి చేసి మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఈ కాలం గూఢచారి కథ. మారిన ప్రపంచ పరిస్దితుల్లో ఇప్పటి స్పై ఏం చేస్తాడు. ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు.దేశానికి సంభందించిన ఏ సమస్యలను పరిష్కరిస్తాడు..అసలు కథేంటి,స్పై గా గోపీచంద్ సెట్ అయ్యాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
undefined
ఇదీ కథ.. : అర్జున్(గోపీచంద్) పెద్ద స్పై (గూఢచారి). ఏ దేశమైనా ఇట్టే వెళ్లిపోయి...పనులు చిటికెలో చేసుకొచ్చేసే సత్తా ఉన్నోడు. అతను ప్రస్తుతం రామకృష్ణ అనే పేరుతో బ్యాంక్ ఎంప్లాయ్ గా పని చేస్తూంటాడు. అర్జున్ బేసిక్ గా టెర్రరిస్ట్ లను పట్టుకునే పనిలో ఉంటాడు. అతను పాకిస్థాన్‌లో దాక్కున్న ఇబ్రహిం (రాజేశ్ కట్టర్), అతడి కొడుకు సోహైల్ (ఉపెన్ పటేల్)ను పట్టుకొనేందుకు మిషన్ ప్రారంభిస్తాడు. ఈ మిషన్ లో భాగంగా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అయిన సోహైల్ కి అంత్యంత సన్నితుడైన టెర్రరిస్ట్ ని అర్జున్, తో పాటు అతని నాలుగురు రా ఏజెంట్స్ తో కలిసి కిడ్నాప్ చేసి, చంపేస్తారు. అయితే తమ వాళ్లను చంపితే టెర్రిరిస్ట్ లు సైలెంట్ గా ఉంటారా... వాళ్లు అర్జున్ నలుగురు ప్రెండ్స్ ను కిడ్నాప్ చేసి పాకిస్తాన్ కి తీసుకెళ్లతారు.
undefined

Latest Videos


అంతేకాదుతీసుకెళ్లిన వాళ్లు తీసుకెళ్లినట్లుండక... అర్జున్ కు ఓ సవాల్ విసురుతారు. దమ్ముంటే వచ్చి వాళ్లని కాపాడు కోమ్మంటారు. మరో ప్రక్క ..అర్జున్ ఫలానా వాడు అనే ఐడెంటిటీ రివీల్ కావడంతో రా కూడా అతన్ని డిపార్టమెంట్ ..ఏజెంట్ గా తీసివేస్తుంది. అప్పుడు చేతిలో అధికారం లేకపోయినా, టీమ్ లేకపోయినా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్స్ నుండి తన ప్రెండ్స్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు..ఆ మిషన్ జరిగింది? పాకిస్దాన్ లో బార్ డాన్సర్ గా పనిచేస్తున్న జుబేదా( జరీనాఖాన్ )తో అర్జున్ కు రిలేషన్ ఏమిటి..అర్జున్ ప్రేమించి మెహ్రిన్ ఏమైంది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
undefined
బందోబస్తు బ్యాచే.. : ఈ మధ్యనే సూర్య నటించగా వచ్చిన బందోబస్తు చిత్రం కూడా ఇలాంటి కాన్సెప్ట్ తోనే రన్ అవుతుంది. అయితే కొంతదూరం వెళ్లాక అది ప్రధాన మంత్రి చుట్టూ కేంద్రీకృతమవుతుంది. ఈ కథ..టెర్రరిస్ట్ ల చేతుల్లో చిక్కుకున్న తన స్నేహితులను ఎలా సేవ్ చేసాడు అనే పాయింట్ కు కనెక్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఐడియా దాకా బాగానే ఉన్నా...కథలో అంతంలేని టెర్రరిజం అనేదాన్ని నాశనం చేయాలని హీరో బయిలుదేరటం వంటివి ఇంట్రస్ట్ గా ఉండవు. ముఖ్యంగా గోపిచంద్ వంటి హీరోకు తగ్గ విలన్ కథలో లేడు. విలన్ స్ట్రాంగ్ గా ఉంటేనే కదా... హీరో సత్తా తెలిసేది. అదే ఇక్కడ కొరవడింది.
undefined
పాకిస్దాన్ లో ఇంకో సాహసం : ఇక మనకు మొదటీ నుంచి రా ఏజెంట్స్, స్పై సినిమాలు సినిమాలు తక్కువే. మన హీరోలు అంత సాహసం చేయటానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే ఇంతకు ముందు గోపిచంద్ ..దాదాపు ఇలాంటి స్టోరీ లైన్ తో సాహసం అనే సినిమా తీసాడు. పాకిస్దాన్ వెళ్లి సాహసాలు చేసే అక్కడ వాళ్లను బురిడి కొట్టించేసి సేఫ్ గా ఇండియా కు వచ్చేసే కథ అది. దేశభక్తితో దడదడలాడించబోయనా బాగుందనిపించుకుంది. దాంతో మరోసారి కేరాఫ్ పాకిస్దాన్ కు షిప్ట్ అయ్యి కథని నడిపించి హిట్ కొట్టాలనుకున్నాడు. అయితే ప్రతీ సారి పాకిస్దాన్ కలిసివస్తుందా.
undefined
ఫస్టాఫ్ జస్ట్ ఓకే అన్నట్లు గా సీన్స్ సాగాయి. స్పైగా ఫరవాలేదు కానీ ఆ మధ్యలో వచ్చే రొమాంటిక్ ట్రాక్, కామెడీ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. ఉన్నంతలో ఇంట్రెవల్ కాస్త ఇంట్రస్టింగ్ ఉంది, సెకండాఫ్ పై ఆసక్తి కలిగిస్తుంది. అది కూడా లేకపోతే సెకండాఫ్ కు జనం ఉండపోదురేమో. ఉన్నంతలో సెకండాఫ్ కొద్దిగా బెస్ట్. గోపీచంద్ పాకిస్దాన్ లోకి వెళ్లాక కథ ఊపందుకుంటుంది. ట్విస్ట్ లు ఫరవాలేదు. అయితే ట్విస్ట్ కు ట్విస్ట్ మధ్యన బోర్ కొట్టే సీన్స్ మనని వెక్కిరిస్తాయి. ఏం చేయాలిరా అనుకునేలోగా జరీన్ ఖాన్ ఐటం సాంగ్ వచ్చి ..ఏం ఫరావాలేదు..కాస్సేపు కూర్చోండి అని భరోసా ఇస్తుంది. ఇంత నీరసంగా ఓ స్పై సినిమా ఉండటానికి కారణం కేవలం స్క్రీన్ ప్లే సమస్యనే. ఇలాంటి సినిమాలో థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎక్సపెక్ట్ చేస్తాం. అలాంటిదేమీ లేదు. ఏదైమైనా..రొటీన్ కథకు అంతకన్నా రొటీన్ స్క్రీన్ ప్లే చేయటంతో ఈ కొత్త స్పై.. కేవలం కొత్త చొక్కా వేసుకున్న పాత గూఢచారే అయ్యాడు.
undefined
టెక్నికల్ గా .. : స్పై సినిమా చేస్తున్నామనే ఆలోచన లేకుండా ఓ మామూలు కథని చేసినట్లు చేసుకుంటూ పోయాడు దర్శకుడు తిరు. అలాగే ఎక్కడో ఇంట్రవెల్ ట్విస్ట్ కోసం ఫస్టాఫ్ మొత్తం బోర్ కొట్టించడం వంటివి సినిమాపై ముందే గౌరవం తగ్గించేస్తాయి. అలా రైటింగ్ సైడ్ వీక్ గా ఉన్న ఈ సినిమా లో ఓపెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ ని ఎదుర్కొవటానికి వెళ్లిన హీరో వేసే ఎత్తులు , ప్లాన్స్ చిత్రంగా ఉంటాయి.అలాగే అంతకు ముందు వచ్చిన చాలా సినిమాలను గుర్తు చేస్తాయి. విశాల్ చంద్ర శేఖర్ బీజీఎమ్ బాగా ఇచ్చాడు కానీ పాటలు బాగోలేదు. లెంగ్త్ తగ్గించటం ఒకటే ఈ సినిమా ప్రేక్షకులకు చేసిన సాయిం. ఇక సినిమాటోగ్రాఫర్ వెట్రి అదరకొట్టాడు. మఖ్యంగా పాకిస్తాన్ లో సాగే సీన్స్ లో కెమెరా వర్క్ బాగుంది. అబ్బూరి రవి రాసిన కొన్ని డైలాగ్స్ జస్ట్ ఓకే అన్నట్లు గా సాగాయి. చెప్పుకోదగ్గవి , గుర్తు పెట్టుకోదగ్గవి లేవు.
undefined
ఫైనల్ థాట్.. : ఈ సినిమా చూస్తూంటే పాకిస్దాన్ అంతా మారువేషాల్లో ఉన్న మన ఇండియన్ రా ఏజెంట్లతో కిటకిటలాడిపోతోందేమో అనిపిస్తుంది
undefined
రేటింగ్ : 25
undefined
click me!