జగన్, కేసీఆర్ లకు కాంగ్రెస్ గాలం: దూతగా కమల్ నాథ్

First Published May 17, 2019, 8:47 AM IST

కేంద్రంలో బిజెపి తిరిగి అధికారంలోకి రాకుండా కాంగ్రెసు పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. 

కేంద్రంలో బిజెపి తిరిగి అధికారంలోకి రాకుండా కాంగ్రెసు పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. బిజెపి వ్యతిరేక పార్టీల మద్దుతును, తటస్థంగా ఉన్న పార్టీల మద్దతును కూడగట్టుకోవడానికి తగిన వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కు కీలకమైన బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది.
undefined
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లతో కమల్ నాథ్ అనధికారికంగా తొలుత చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఈ ముగ్గురు కూడా అటు ఎన్డీఎలోనూ, ఇటు యుపిఎలోనూ లేరు. తటస్థంగా ఉన్నారు
undefined
కమల్ నాథ్ పాటు ఇద్దరు ఎఐసిసి నాయకులు ఉంటారని, ప్రాంతీయ పార్టీల డిమాండ్లను, అభిప్రాయాలను తెలుసుకుంటారని అంటున్నారు. కేంద్రంలో యుపిఎ అధికారంలోకి రావడానికి వారికి గల అభిప్రాయాలను తెలుసుకుంటారని సమాచారం
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి కేంద్రంలో తాను మద్దతు ఇస్తానని జగన్ బహిరంగంగానే చెప్పారు. నోటి మాటగా కాకుండా రాతపూర్వకరమైన హామీని ఆయన కోరుతున్నారు. అయితే, జగన్ పై తప్పుడు కేసులు బనాయింపజేసి, ఆయన ప్రతిష్టను దెబ్బ తీయడానికి కాంగ్రెసు ప్రయత్నించిందని, అందువల్ల జగన్ కాంగ్రెసుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉండదని వైసిపి నాయకులు కొందరు అంటున్నారు
undefined
కాంగ్రెసుకు ప్రధానమంత్రి పదవి దక్కకపోయినా ఫరవా లేదని, బిజెపిని అడ్డుకోవడానికి తాము ప్రధాన మంత్రి పదవిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏఐసిసి సభ్యుడు గులాం నబీ ఆజాద్ చెప్పారు. బిజెపిని అడ్డుకోవడానికి ఇతర పార్టీలు ముందుకు రావాలని ఆయన అంటున్నారు. ప్రధాన మంత్రి పదవిపై చిచ్చు రగలకుండా చూడడానికి తాము తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు
undefined
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మద్దతుతో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయినా కూడా తమకు అభ్యంతరం లేదని తెలంగాణ శాసనసభ్యుడు జగ్గారెడ్డి అన్నారు. తమకు రాష్ట్రంలో అధికారం ముఖ్యం కాదని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం తమకు ముఖ్యమని ఆయన గురువారం మీడియాతో అన్నారు
undefined
click me!