CHANKYA NITI
ఆచార్య చాణక్యుడు మానవ జీవితం గురించి ఎన్నో విషయాలను తన నీతి శాస్త్రంలో వివరించాడు. ముఖ్యంగా వైవాహిక జీవితం గురించి ఎంతో చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం.. కొన్ని లక్షణాలున్న ఆడవారు తమ అత్తమామలను కంటికి రెప్పలా చూసుకుంటారు. ఇలాంటి కోడలున్న ఇళ్లు స్వర్గంలా ఉంటుందని నీతి శాస్త్రం చెబుతోంది. ఇలాంటి మహిళలను పెళ్లి చేసుకున్న పురుషుల జీవితం చాలా సంతోషంగా ముందుకు సాగుతుంది. అలాగే ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అసలు ఎలాంటి లక్షణాలున్న భార్య దొరకడం భర్త అదృష్టమో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
chankya niti
భర్తలకు అడుగడుగునా అండగా ఉండే మహిళలు
చాణక్య నీతి ప్రకారం.. భర్తలకు అడుగడుగునా అండగా ఉండే ఆడవారు భర్త సుఖ సంతోషాల్లోనే కాదు.. వారి బాధ, దుఃఖంలో కూడా అండగా ఉంటారు. ఇలాంటి ఆడవారు ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇల్లు స్వర్గంలా అందంగా మారుతుంది. ఇంటిని మెయింటైన్ చేయడానికి కేవలం డబ్బు, ఆస్తులు మాత్రమే కాదు గౌరవం, ప్రేమ కూడా అవసరమవుతాయని ఆచార్య చాణక్యుడు అంటాడు. గౌరవం, ప్రేమతో ఇంటిని నడిపే ఆడవారు ఉన్న ఇల్లు ఎప్పుడూ సాఫీగా,ప్రగతి పథంలో సాగిపోతూ ఉంటుంది.
ఎప్పుడూ భర్తను చూసి గర్వపడేవారు
చాణక్య నీతి ప్రకారం.. తమ భర్తలను చూసి గర్వపడేవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. తమ భర్త చిన్న విజయాన్ని సాధించినా ఎంతో మురిసిపోతారు. పండుగ చేసుకుంటారు. వారు కూడా ఎంతో పుణ్యాత్ములుగా భావిస్తారు. అంతేకాదు తప్పులను సరిదిద్దుకోవడానికి భర్తకు కూడా సహాయం చేస్తారు.
ఇలాంటి వారు వారి బలహీనతలను అందరి ముందు అస్సలు పెట్టరు. ఏ తప్పు జరిగినా ఇంటి వరకే ఉంచుతారు. పదిమందికి చెప్పుకోని నవ్వుల పాలు కారు. ఇలాంటి స్త్రీలున్న ఇల్లు స్వర్గానికి ఏ మాత్రం తీసిపోదు. ఈ సద్గుణవంతులైన ఆడవారు ఎప్పుడూ తమ భర్త మంచి పనుల గురించి అందరికీ చెప్పి, చెడు లక్షణాలను ఎవ్వరికీ చెప్పకుండా సరిదిద్దే ప్రయత్నం చేస్తారు.
పెద్దలను గౌరవించే మహిళలు
ఒక ఇంటిలోపలి వాతావరణం ఎలా ఉంటుందో ఆ ఇంట్లో ఉంటున్న పెద్దల ముఖాన్ని చూస్తేనే తెలుస్తుంది. చాణక్య నీతి ప్రకారం.. ఇంట్లో పెద్దలు సంతోషంగా ఉన్నట్టైతే ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రేమ, నవ్వు, సంతోషం ఉంటాయి. ఇంటి పెద్దలను గౌరవించి, వారికి సేవ చేసే మహిళలు ఇంటి పురోగతికి ఎంతో ప్రయత్నిస్తారు. వీరి ప్రయత్నాల్ని ఎవరూ ఆపలేరని చాణక్యుడు అంటాడు. అంతేకాదు ఇలాంటి ఆడవారు పిల్లల్ని మంచి మార్గంలో పెంచుతారు.
ఇంట్లోని లోపాలను బయటపెట్టని వారు
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. తమ ఇంట్లోని లోపాల గురించి బయటపెట్టని వారు ఇతరు ముందు కుటుంబ సభ్యుల గురించి ఎవ్వరి ముందు చెడుగా మాట్లాడరు. ఇలాంటి లక్షణాలున్న మహిళలు తమ ఇంటిని స్వర్గంలా చేసుకుంటారు. వీళ్లు ఇంట్లోని లోటుపాట్లను, చెడు గురించి ఇతరులకు చెప్పడానికి బదులుగా వాటిని ఒంటరిగా మెరుగుపరిచే ప్రయత్నం చేస్తారు.
కోపాన్ని అదుపులో పెట్టుకునేవారు
చాణక్య నీతి ప్రకారం.. కోపం తక్కువగా వచ్చేవారు లేదా కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో తెలిసిన ఆడవాళ్లు ఉండే ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి వాతావరణం ఉంటాయి. చాణక్య ప్రకారం.. బాగా కోపంగా ఉండే ఆడవారు తమ ఇంటిని ఎప్పటికీ సంతోషంగా ఉంచుకోలేరు.