బాదం పప్పుులను దాదాపుగా 5 నుంచి 6 గంటలు పక్కాగా నానబెట్టాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ఈ బాదం పప్పుల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఈ, ప్రోటీన్, డైటరీ ఫైబర్స్, ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు మెండుగా ఉంటాయి. అంతేకాదు ఇందులో మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఎముకలను బలంగా చేయడానికి ఎంతో సహాయపడతాయి.