మీ జుట్టు బాగా రాలుతోందా? ఈ నూనె పెడితే జుట్టు అస్సలు ఊడదు..

Published : Aug 05, 2023, 01:14 PM IST

ఉల్లిపాయ నూనెతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ నూనె జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.   

PREV
16
మీ జుట్టు బాగా రాలుతోందా? ఈ నూనె పెడితే జుట్టు అస్సలు ఊడదు..
Image: Getty

జుట్టు రాలడానికి ఎన్నో కారణాలున్నాయి. కానీ దీనివల్ల అందం తగ్గడంతో పాటుగా ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. అయితే కొన్ని నూనెలు జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. ఇలాంటి వాటిలో ఉల్లిపాయ నూనె ఒకటి. అవును ఆనియన్ ఆయిల్ హెయిర్ ఫాల్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ నూనెలో సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జుట్టును మరింత బలంగా చేస్తుంది. పొడుగ్గా పెరిగేందుకు సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడంలో ఉల్లిపాయ నూనె చేసే ప్రయోజనాల గురించి  ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

26
Image: Getty

జుట్టు పెరగడానికి.. 

ఉల్లిపాయ నూనెలోని సల్ఫర్ కంటెంట్ జుట్టు కుదుళ్లకు మంచి పోషణను అందిస్తుంది. అంతేకాదు ఫోలికల్స్ ను కూడా ప్రేరేపిస్తుంది. అలాగే జుట్టు సన్నబడటాన్ని తగ్గించి జుట్టు పెరిగేలా చేస్తుంది. అందుకే మీ జుట్టు చిన్నగా ఉంటే ఉల్లిపాయ నూనెను ట్రై చేయండి.
 

36
Image: Getty

జుట్టును బలోపేతం చేస్తుంది

ఉల్లిపాయ నూనె మన జుట్టు వెంట్రుకలను మూలాల నుంచి బలోపేతం చేస్తుంది. విచ్ఛిన్నతను తగ్గిస్తుంది. అలాగే మీ జుట్టును మరింత స్థితిస్థాపకంగా చేస్తుంది. తరచూ వెంట్రుకలు రాలే అవకాశాన్ని తగ్గిస్తుంది. 

46
Image: Getty

చుండ్రు నియంత్రణ

ఉల్లిపాయ నూనెలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు  ఉంటాయి. ఇవి స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు, చుండ్రుతో పోరాడతా. అలాగే జుట్టు పెరుగుదలకు నెత్తిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ నూనె చుండ్రు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

56

రక్త ప్రసరణను పెంచుతుంది

ఉల్లిపాయ నూనె కూడా మన నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు జుట్టు కుదుళ్లకు చేరేలా చేస్తుంది. రక్తప్రసరణ మెరుగ్గా ఉంటే జుట్టు బలంగా, పొడుగ్గా  పెరుగుతుంది. 
 

66

కొల్లాజెన్ ఉత్పత్తి

ఉల్లిపాయ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఉల్లిపాయ నూనె కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది. అలాగే మొత్తం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 

click me!

Recommended Stories