గోర్లు ఎంత వేగంగా పెరుగుతాయంటే?
మీకు తెలుసా? మన గోర్లు నెలకు సగటున 3.5 మిల్లీమీటర్లు పొడవు పెరుగుతాయి. అయితే మన గోర్లు పెరగడమనేది వయస్సు, లింగం, హార్మోన్లతో సహా ఎన్నో విషయాల వల్ల ప్రభావితం అవుతుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో గోర్లు చాలా ఫాస్ట్ గా పెరుగుతాయట. అయినప్పటికీ.. ఆడవారితో పోలిస్తే మగవారికే గోర్లు వేగంగా పెరుగుతాయట. అంతేకాదు అనారోగ్యం తర్వాత కూడా గోర్లు కూడా వేగంగా పెరుగుతాయి. చలికాలంలో కంటే ఎండాకాలంలోనే గోర్లు వేగంగా పెరుగుతాయి ఎప్పుడైనా గమనించారా? విచిత్రమేంటంటే.. మన వేళ్లు ఎంత పొడుగ్గా ఉంటే మన గోర్లు కూడా అంత వేగంగా పెరుగుతాయి. మధ్య గోరు వేగంగా పెరుగుతుంది. అయితే బొటనవేలి గోర్లు మాత్రం చాలా నెమ్మదిగా పెరుగుతాయి.