పిల్లలను క్రమ శిక్షణతో పెంచడమే కాదు.. వారికి సమాజం పట్ల అవగాహన కల్పించడం కూడా ఎంతో ముఖ్యం. ఈ విషయాలను వారు చిన్నప్పటి నుంచి చెబితేనే.. ఫ్యూచర్ లో వాళ్లు ఇబ్బందులు పడాల్సిన అవసరం రాదు. మరి పిల్లలకు ఎలాంటి విషయాలను నేర్పాలో తెలుసుకుందాం పదండి.
పిల్లలకు ఏదైనా అవసరమైనప్పుడు.. ఆ విషయం గురించి మర్యాదపూర్వకంగా అడగాలని వారికి చెప్పాలి. డిమాండ్ చేసినట్టుగా అడగకూడదని వారికి చెప్పాలి.
చిన్నదైనా.. పెద్దదైనా.. పిల్లలకు ఎవరైనా సాయం చేసినప్పుడు మర్చిపోకుండా వారికి ధన్యవాదాలు (thanks) చెప్పాలని చెప్పాలి. ఈ విషయం వారికి ఖచ్చితంగా చెప్పాలి.
చాలా మంది పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఎక్కడో చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇది మంచి పద్దతి కాదు. పేరెంట్స్ తో అయినా.. వేరేవాళ్లు ఎవరైనా కానీయండి.. వారితో మాట్లాడేటప్పుడు వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడాలని చెప్పాలి. ఐ కాంటాక్ట్ వల్ల వారు ఇతరులు చెప్పేది తొందరగా అర్థం చేసుకుంటారు.
ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడటం చెడ్డ అలవాటు. చాలా మందికి ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ పిల్లలకు మాటల మధ్యలో మాట్లాడకూడదని చెప్పండి. ఇప్పటి నుంచి చెబితేనే వారు అలా మాట్లాడకుండా ఉంటారు.
ఒక్క చిరునవ్వుతో ఎన్నో సమస్యలను ఇట్టే తొలగించొచ్చు అంటారు. కాబట్టి మీ పిల్లలు ఎప్పుడూ ముఖంపై చిరునవ్వు ఉండేలా చూడండి. బంధువులు, స్నేహితులతో ముఖంపై చిరునవ్వుతో పలకరించమని చెప్పండి.
ఇంటికి బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు వారిని పట్టించుకోకుండా.. ఆటలో లీనం కాకుండా.. వచ్చిన గెస్ట్ లకు హాయ్, నమస్తే, బావున్నారా? అంటూ చిరునవ్వుతో పలకరించమని చెప్పాలి.
వారి స్నేహితులకు హాయ్ లేదా బాయ్ చెప్పేటప్పుడు వారిని హగ్ చేసుకోవడమో లేకపోతే షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడాలని చెప్పండి.