తిమింగళం కక్కింది.. అతనికి అదృష్టం పట్టింది..!

First Published Jan 20, 2021, 11:28 AM IST

సముద్ర తీరంలో చపాతీపిండిలాంటి ఓ పదార్థం దొరికింది ఓ వ్యక్తికి. అదేంటో అని ఆరాతీస్తే అది తిమింగలం వాంతి అని తెలిసింది. ఛీ అని పడేయలేదు బంగారంలాగా దాచుకున్నాడు. దాంతో కోటీశ్వరుడయ్యాడు. అతనికి దొరికిన ఆ వాంతి విలువ అక్షరాలా రూ.2.09 కోట్లు..

సముద్ర తీరంలో చపాతీపిండిలాంటి ఓ పదార్థం దొరికింది ఓ వ్యక్తికి. అదేంటో అని ఆరాతీస్తే అది తిమింగలం వాంతి అని తెలిసింది.
undefined
ఛీ అని పడేయలేదు బంగారంలాగా దాచుకున్నాడు. దాంతో కోటీశ్వరుడయ్యాడు. అతనికి దొరికిన ఆ వాంతి విలువ అక్షరాలా రూ.2.09 కోట్లు..
undefined
వివరాల్లోకి వెడితే ఈ మధ్యే థాయ్‌లాండ్‌లోని సమీలా బీచ్‌ వద్ద ఓ మత్స్యకారుడికి ఇసుకలో తెల్లటి ముద్దలాగ ఏదో కనిపించింది.
undefined
ఏదో రాయి అనుకున్నాడట. దగ్గరకు వెళ్లి చూస్తే.. ఇదేదో పనికొచ్చేదానిలాగ ఉంది అనుకుని.. ఇంటికి తీసుకెళ్లాడట.
undefined
ఆ తర్వాత ఊర్లోని పెద్దోళ్లకు చూపిస్తే, అసలు విషయం చెప్పారు. ఇది స్పెర్మ్‌ వేల్‌ వాంతి అని.. దీన్ని అంబర్‌గ్రీస్‌ అంటారని తెలిపారు.
undefined
మామూలుగా ఇవి నీళ్ల మీద తేలియాడుతూ కనిపిస్తాయి లేదా తీరానికి కొట్టుకొస్తాయి.
undefined
ఫ్రెష్‌గా ఉన్నప్పుడు కంపు వాసన కొడుతుంది. కానీ.. ఓసారి గట్టిపడ్డాక సువాసన వెదజల్లుతుంది. అందుకే దీనికి పెర్ఫ్యూమ్‌ ఇండస్ట్రీలో తెగ క్రేజ్‌. దానికి తగ్గట్టుగానే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
undefined
తిమింగలం జీర్ణ వ్యవస్థలోని పిత్తాశయం నుంచి వెలువడ్డ స్రావం నుంచి ఇది తయారవుతుందట. గతంలో ఇంతకన్నా పెద్దది రూ.22 కోట్లకు అమ్ముడుపోయిందట.
undefined
click me!