మానవ నిర్మిత ఉల్కాపాతం! నాసా పరిశోధనలో భూమి, అంగారకుడికి ముప్పు

First Published Sep 5, 2024, 11:32 PM IST

2022 లో ఒక గ్రహశకలాన్ని నాశనం చేయడానికి చేపట్టిన ప్రయత్నంలో సృష్టించబడిన శిధిలాల వల్ల భూమికి ప్రమాదం వుందనే అనుమానాలు తలెెత్తుతున్నాయి. 

మానవ నిర్మిత ఉల్క

నాసా యొక్క కొత్త పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయం బయటకు వచ్చింది.  నాసా చేపట్టిన ఒక మిషన్ కారణంగా ఈ ఉల్కాపాతం సంభవించవచ్చు.

నాసా మిషన్

నాసా డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ కారణంగా ఉల్కాపాతం సంభవించవచ్చనే ఆందోళన మొదలయ్యింది. అంటే దీనివల్ల భూమికి ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయట. 

Latest Videos


మానవ निर्मित ఉల్క కారణం

2022 లో నాసాకు చెందిన డార్ట్ అంతరిక్ష నౌక ఉద్దేశపూర్వకంగా ఒక చిన్న గ్రహశకలాన్ని ఢీకొట్టింది. దీని ఫలితంగా ఉల్కలు ఏర్పడ్డాయి.

మిషన్ ఉద్దేశ్యం

గ్రహశకలాన్ని ఢీకొట్టడం వల్ల అంతరిక్ష నౌక  ధ్వంసమైందని నాసా తెలిపింది. గ్రహశకలం కూడా ధ్వంసమైంది. దీంతో అంతరిక్షంలో భారీ శిధిలాలు ఏర్పడ్డాయి.

భూమికి ముప్పు

నాసా యొక్క ఈ పరీక్ష కారణంగా భూమిపై ఉల్కాపాతం సంభవించవచ్చు. అంతరిక్ష నౌక, గ్రహశకలం తాకిడి కారణంగా అంతరిక్షంలో దాదాపు 2 మిలియన్ పౌండ్ల శిలలు, దుమ్ము ఏర్పడిందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అవి భూమిపై ఉల్కలుగా కురవవచ్చట.

పరీక్ష ఉద్దేశ్యం

ఏదైనా గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉంటే, అంతరిక్ష నౌక ద్వారా దాని కక్ష్యను మార్చవచ్చా లేదా అనేది తెలుసుకోవడానికే డార్ట్ మిషన్ చేపట్టామని నాసా తెలిపింది.

కార్నెల్ విశ్వవిద్యాలయం అధ్యయనం

రాబోయే 10-30 సంవత్సరాలలో ఈ ఉల్కలు భూమి, అంగారక గ్రహాలను చేరుకునే అవకాశం ఉంది. ఈ కణాలు అంగారక గ్రహం కక్ష్యలోకి ప్రవేశించిన వెంటనే కంటికి కనిపించే ఉల్కలుగా మారతాయి. దీని ఫలితంగా ఉల్కాపాతం సంభవించవచ్చు.

సంవత్సరం పాటు ఉల్కాపాతం

ఉల్కాపాతం ప్రారంభమైన తర్వాత దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి, అంగారక గ్రహాలపై నాసా పరీక్ష కారణంగా నిరంతరాయంగా ఉల్కాపాతం సంభవించే అవకాశం ఉంది.

ఉల్కల వల్ల ఎంత ప్రమాదం?

ఉల్కలు పెద్దగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. అవి బఠానీ గింజ నుండి స్మార్ట్‌ఫోన్ పరిమాణంలో ఉంటాయి. అవి భూమిపై పడినప్పుడు మానవులకు ఎలాంటి హాని కలిగించవు.

click me!