ట్విట్టర్ కొత్త సీఈవో గా లిండా యక్కరినో.. ! ఆమె ఎవరంటే...?

First Published May 12, 2023, 1:52 PM IST

లిండా యాకారినో పెన్ స్టేట్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి, లిబరల్ ఆర్ట్స్, టెలికమ్యూనికేషన్‌లు చేశారు.

న్యూఢిల్లీ : ఎన్‌బిసి యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్ హెడ్ లిండా యక్కరినో ట్విట్టర్ కొత్త సిఇఒగా దాదాపు ఖరారైనట్లుగా సమాచారం. గురువారం ట్విట్టర్‌కు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ని కనుగొన్నట్లు ఎలోన్ మస్క్ తెలిపారు. అయితే, సీఈఓ ఎవరనేది పేరు చెప్పలేదు. లిండా నాయకత్వం ట్విటర్ ను మరింత లాభదాయకంగా మార్చేందుకు అవసరమని భావించినట్లుగా తెలుస్తోంది. 

లిండా యాకారినో ట్విట్టర్ సీఈఓగా దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆమె ప్రత్యేకలేంటో ఒకసారి చూస్తే... 

లిండా యాకారినో దశాబ్దానికి పైగా ఎన్ బీసీయూ యూనివర్సల్ లో పనిచేశారు. ఇక్కడ ఉన్న సమయంలో ఆమె ఆ కంపెనీలోని వివిధ విభాగాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ముఖ్యంగా ప్రకటనలు, సేల్స్ డిపార్ట్ మెంట్ హెడ్ గా పనిచేశాడు. కంపెనీ యాడ్-సపోర్టెడ్ పీకాక్ స్ట్రీమింగ్ సర్వీస్‌ను ప్రారంభించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.

లిండా యాకారినో టర్నర్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 19 సంవత్సరాల సుదీర్ఘ సేవలు అందించారు. నెట్‌వర్క్ ప్రకటన విక్రయాల ఆపరేషన్‌ను డిజిటల్ మాద్యమంలోకి రంగప్రవేవం చేయించిన ఘనత లిండాదే. 

ఆమె లిబరల్ ఆర్ట్స్, టెలికమ్యూనికేషన్స్ చదివిన పెన్ స్టేట్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి.

గత నెలలో మియామీలో జరిగిన ఒక అడ్వర్టైజింగ్ కాన్ఫరెన్స్‌లో యక్కరినో మస్క్‌ని ఇంటర్వ్యూ చేశారు. ఈ సమావేశంలో, యక్కరినో చప్పట్లతో మస్క్‌ను స్వాగతించమని ప్రేక్షకులను ప్రోత్సహించారు. అతని పని తీరును ప్రశంసించారు. ‘స్నేహితుడు’, ‘మిత్రుడు’ అంటూ సంభోదిస్తూ కొనియాడారు. ఇది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

ఎన్‌బిసి యూనివర్సల్‌ కంపెనీకి లిండా నిష్క్రమణ మరో పెద్ద దెబ్బ అవ్వనుంది. గత నెల కంపెనీ సీఈవో జెఫ్ షెల్ తాను మానేస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీలోని ఒక మహిళతో అనైతిక సంబంధం ఉందన్న ఆరోపణలు, దర్యాప్తు నేపథ్యంలో జెఫ్ షెల్ కంపెనీని విడిచిపెడుతున్నానని ప్రకటించారు.

ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు తీసుకునేందుకు లిండాకు అన్ని అర్హతలూ ఉన్నాయి. యాడ్ ఫోంటెస్ మీడియాలో సీఎఫ్వోగా బాధ్యతలు చేపడుతున్న లౌ పాస్కాలిస్ కూడా ఆమె ఎంపిక సరైందేనని అన్నారు. అయితే, లిండా యాకారినో కు ఎలాన్ మస్క్ తో కలిసి పనిచేయాలని ఎందుకు అనిపించిందో అర్థం కాలేదని ఆశ్చర్యపోయారు. 
 

click me!