కోడలికి కొడుకు పుట్టడం లేదని ఓ మామ దారుణానికి ఒడి గట్టాడు. కోడలిని తనతో పడుకోమని వేధించడం మొదలుపెట్టాడు. దీనికి భర్త కూడా తోడవ్వడంతో ఆ భార్య పోలీసులను ఆశ్రయించింది. గుంటూరులో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
గుంటూరుకు చెందిన సునీత(పేరు మార్చాం) ఓ బట్టలషాపులో పనిచేసేది. తనతో పాటు పనిచేసే రాకేష్ (పేరు మార్చాం)తో ప్రేమలో పడింది. ఇరు వైపులా పెద్దల్ని ఒప్పించి 2016లో పెళ్లి చేసుకున్నారు.
మొదట్లో బాగానే ఉన్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. సమస్యల అక్కడే మొదలయ్యింది. మగపిల్లలు పుట్టట్లేదంటూ భర్త వేధించడం మొదలుపెట్టాడు. దీనికి మామ తోడయ్యాడు. నీకు నా కొడుకుతో మగపిల్లలు పుట్టట్లేదు. నాతో పడుకో.. నేను చూసుకుంటా అంటూ వేధించడం మొదలుపెట్టాడు.
భర్తతో చెబితే నాన్న చెప్పినట్టు వినూ అంటూ షాకిచ్చాడు. అర్థం చేసుకుంటుందని అత్తతో చెబితే ఇవన్నీ మామూలే అంటూ భర్తను వెనకేసుకొచ్చి మరో షాక్ ఇచ్చింది. వీరిద్దరి బాధ భరించలేక సునీత పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
అయినా కీచకుడైన మామ వదలలేదు. పిల్లల్ని చూడాలనిపిస్తుందన్న సాకుతో అక్కడికీ వచ్చేశాడు. తల్లీదండ్రీ ఇంట్లో లేని టైం చూసి కోడలిపై అత్యాచారం చేయబోయాడు.
ఎలాగో మామ నుండి తప్పించుకున్న సునీత గుంటూరులో జరిగే పోలీసు స్పందన కార్యక్రమంలో తన గోడు వెల్లబోసుకుంది. సునీత కథ విన్న ఏఎస్పీ గంగాధరంకు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీసులకు ఆదేశాలిచ్చారు.