సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకి కరోనా పాజిటివ్...

First Published | Oct 13, 2020, 8:19 PM IST

ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం నేషన్స్ లీగ్ గేమ్స్‌ ఆడుతున్న రొనాల్డోకి కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే జట్టును వీడి, ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు పోర్చుగ్రీసు ఫుట్‌బాల్ ఫెడరేషన్ పేర్కొంది. 

కరోనా బారిన పడినప్పటికీ రొనాల్డో‌లో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని, అతను ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పింది ఫుట్‌బాల్ ఫెడరేషన్.
త్వరలోనే రొనాల్డో కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది.

పోర్చుగ్రీసు ప్రొఫెషనల్ పుట్‌బాలర్ అయిన రొనాల్డో జెర్సీ నెంబర్ 7...
ఫోర్చుగల్‌లోని ఫంచల్ ఏరియాలో పుట్టిన రొనాల్డో, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.
ఏటా బ్రాండ్ ప్రమోషన్ ద్వారా వందల కోట్లు ఆర్జిస్తున్న క్రిస్టియానో రొనాల్డో, ప్రపంచంలో అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రీడాకారుల్లో ఒకడిగా ఉన్నాడు...
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, రొనాల్డో సాకర్‌లో దిగ్గజ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు...
ఇప్పటిదాకా 873 ఫుట్‌బాల్ గేమ్స్ ఆడిన రొనాల్డో, 615 గోల్స్ చేశాడు...మరో 196 గోల్స్‌ను అసిస్ట్ చేశాడు..
ఈ ఏడాది అత్యధిక మొత్తం ఆర్జించిన ఫుట్‌బాల్ క్రీడాకారుల్లో మెస్సీ టాప్‌లో నిలవగా, రొనాల్డో రెండో స్థానంలో నిలిచాడు.

Latest Videos

click me!