Toothpaste: మీ టూత్‌పేస్టు వెజ్ లేదా నాన్-వెజ్? ఇలా తెలుసుకోండి

Published : Sep 28, 2026, 10:42 AM IST

Toothpaste: మీరు రోజూ వాడే టూత్ పేస్టు వెజిటేరియనా? లేక నాన్ వెజిటేరియనా? ఆ టూత్ పేస్టుపై ఉండే ఆకుపచ్చ, ఎరుపు, నీలం, నలుపు రంగుల ద్వారా అసలు విషయాన్ని తెలుసుకోవాలి. దీని వెనుక ఉన్న అసలు నిజాలు తెలుసుకోండి.

PREV
13
మీ టూత్ పేస్టు వెజ్ లేదా నాన్ వెజ్?

ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేస్తారు అందరూ. వారు వాడే టూత్ బ్రష్ వెజిటేరియనా లేక నాన్ వెజిటేరియనా అన్నది చాలా మందికి తెలియదు. పేస్ట్ ట్యూబ్ అడుగున ఉండే ఆకుపచ్చ, ఎరుపు, నీలం, నలుపు రంగుల గీతలు ఎందుకు ఉన్నాయో కూడా వారికి తెలియదు. ఆ రంగులకు అర్థాలేంటో.. టూత్ పేస్టు వెజ్ లేదా నాన్ వెజ్ అన్నది ఎలా తెలుసుకోవాలి?

పేస్ట్ ట్యూబ్ అడుగున చూడండి.. ఆకుపచ్చ, ఎరుపు, నీలం, నలుపు రంగుల గీతలు ఉంటాయి. వీటిని 'Eye Mark' (ఐ మార్క్) అని పిలుస్తారు. పేస్ట్ ట్యూబ్ తయారు చేసేటప్పుడు, దాన్ని ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ మడతపెట్టాలి, ఎక్కడ సీల్ చేయాలి అనేది మెషిన్ సెన్సార్లు గుర్తించడానికి ఈ మార్క్ ఉపయోగిస్తారు. అంతకన్నా ఎక్కువ అర్థం వీటిలో లేదు.

23
పేస్ట్ వెజ్ లేదా నాన్-వెజ్ అని ఎలా తెలుసుకోవాలి?

పేస్ట్ ట్యూబ్ అడుగున ఉండే రంగులను బట్టి అది వెజ్ లేదా నాన్-వెజ్ అని తెలుసుకోలేం. దానికి బదులుగా, ప్యాకెట్ మీద ఉండే వెజిటేరియన్ లేదా నాన్-వెజిటేరియన్ (Vegetarian / Non-Vegetarian) మార్క్, తయారీ వివరాలను చూడాలి.

2026 సెప్టెంబర్ 21న విడుదల చేసిన Legal Metrology (Packaged Commodities) Fourth Amendment Rules ప్రకారం.. సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్ లాంటి కాస్మెటిక్స్, టాయిలెట్రీస్ ప్యాకెట్ల మీద అవి వెజ్ (vegetarian origin) లేదా నాన్-వెజ్ (non-vegetarian origin) అని కచ్చితంగా ముద్రించాలి.

33
పేస్ట్ వెజ్ లేదా నాన్-వెజ్?

ఈ టూత్ పేస్టు మీద ఆకుపచ్చ రంగు చుక్క ఉంటే అది వెజిటేరియన్ (vegetarian origin) పదార్థాలతో తయారు చేశారని అర్థం చేసుకోవాలి. అదే ఎరుపు లేదా గోధుమ రంగు చుక్క ఉంటే అందులో నాన్-వెజిటేరియన్ (Non-Vegetarian Origin) పదార్థాలు వాడారని అర్థం చేసుకోవాలి. కొత్త రూల్స్ ప్రకారం ఈ మార్క్ ప్యాకెట్ ముందు భాగంలోనే స్పష్టంగా కనిపించాలి.

టూత్ పేస్ట్ తయారీలో గ్లిజరిన్ లేదా గ్లిజరాల్ (glycerin/glycerol) లాంటి పదార్థాలను వాడతారు. పేస్ట్ ఎండిపోకుండా, సరైన టెక్చర్‌తో ఉండటానికి వీటిని కలుపుతారు. ఈ గ్లిజరిన్‌ను మొక్కల నూనెల నుంచి, కృత్రిమ పద్ధతుల్లో, కొన్నిసార్లు జంతువుల కొవ్వు నుంచి కూడా తయారు చేస్తారు. కాబట్టి, కేవలం అందులో వాడిన పదార్థాల పేర్లను బట్టి పేస్ట్ వెజ్ లేదా నాన్-వెజ్ అని మనం డిసైడ్ చేయలేం. ఆ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది, కంపెనీ వాళ్లు ఇచ్చిన వివరాలు ఏంటి అనేది మాత్రమే చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories