ఎలాగైనా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించేలా మంచు విష్ణు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఇటీవల మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ సెలెబ్రిటీలని ట్రోల్ చేసే, అసభ్యకరమైన థంబ్ నెయిల్స్ పెట్టే వందలాది యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకున్నారు.