నువ్వే నా ధైర్యం, నీతో జర్నీ అద్భుతం.. రకుల్‌ని ఆకాశానికి ఎత్తుతూ ప్రియుడు బర్త్ డే విషెస్‌.. పోస్ట్ వైరల్‌

Aithagoni Raju | Published : Oct 11, 2023 9:52 AM
Google News Follow Us

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌ లో బిజీగా ఉంది. తెలుగు సినిమాలకు గుడ్‌ బై చెప్పిన ఈ భామ హిందీలో మాత్రం బిజీగా గడుపుతుంది. దీనికితోడు ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. 
 

17
నువ్వే నా ధైర్యం, నీతో జర్నీ అద్భుతం.. రకుల్‌ని ఆకాశానికి ఎత్తుతూ ప్రియుడు బర్త్ డే విషెస్‌.. పోస్ట్ వైరల్‌

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(Rakul Preet Singh) కెరీర్‌ పీక్‌ స్టేజ్‌ని చూసింది. బిగ్‌ స్టార్స్ అందరితోనూ కలిసి నటించింది. కొటి రెండు రౌండ్లు సినిమాలు చేసింది. ఇక తెలుగులో ఆఫర్లు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ ఒకేసారి పదికిపైగా సినిమాలకు కమిట్‌ అయ్యింది.
 

27

బాలీవుడ్‌లో రెండుమూడేళ్లుగా ఆమె క్షణం తీరికలేకుండా గడుపుతుంది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్‌ అవుతుండటం విశేషం. అంత బిజీగా ఉన్నా తన ప్రేమని మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. ప్రియుడు జాకీ భగ్నానీతో ఫ్రీ టైమ్‌ని స్పెండ్‌ చేస్తూ మెమరీస్‌ని ఫిల్‌ చేసుకుంటుంది. 
 

37

తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన బర్త్ డే జరుపుకుంది. మంగళవారం 33ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ తో సెలబ్రేట్‌ చేసుకుంది రకుల్‌. పార్టీలతో ఎంజాయ్‌ చేసింది. అయితే తన బర్త్ డే సందర్భంగా ప్రియుడు జాకీ భగ్నానీ(Jackky Bhagnani) పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో తన గర్ల్ ఫ్రెండ్‌ని ఆకాశానికి ఎత్తేశాడు జాకీ. 
 

Related Articles

47

ఇందులో ఆయన చెబుతూ, నీ ప్రత్యేకమైన రోజున సందర్భాన్ని పురస్కరించుకుని నన్ను నిత్యం సర్‌ప్రైజ్‌ చేసే వ్యక్తి గురించి నా అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నా. నీతో ఉంటే ప్రతి రోజు ఒక అద్బుతమైన ప్రయాణంలా అనిపిస్తుంది. ఎప్పుడూ అలసిపోయిన ఫీలింగే కలగదు. నువ్వు నా జీవిత భాగస్వామి కంటే ఎక్కువ. నువ్వే నా ధైర్యం. నా ప్రతి అడుగులో నువ్వే నా పార్ట్ నర్‌. 

57

నాజీవితాన్ని ప్రేమ, సంతోషంతో నింపే వ్యక్తి నువ్వే. ఈ గొప్ప రోజున నువ్వు కన్న కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. మీ కలలన్నీ నిజమవుతాయి. ఎందుకుంటే నువ్వు మాత్రమే జీవితంలో ఉత్తమమైన వాటిని సాధించడానికి అర్హురాలివి. ప్రతి రోజుని అద్భుతంలా మార్చే వ్యక్తికి బర్త్ డే విషెస్‌` అని క్రేజీగా పోస్ట్ పెట్టాడు జాకీ. ఇందులో రకుల్ తో గడిపిన క్షణాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను మిక్స్ చేసిన ఓ బ్యూటీఫుల్‌ వీడియోని షేర్‌ చేశాడుజాకీ. దీంతో ఈ పోస్ట్ వైరల్‌ అవుతుంది. 
 

67

దీనికి రకుల్‌ కూడా స్పందించింది. హా.. చాలా టైమ్‌ చేశావు. అది నన్ను ఆశ్చర్యపరిచింది. వాహ్‌ అనేలా చేసింది. థ్యాంక్యూ మై లవ్‌` అని పేర్కొంది రకుల్. ఈ సందర్భంగా సెలబ్రిటీలు కూడా ఆమెకి బర్త్ డే విషెస్‌ తెలిపారు. రకుల్‌.. బాలీవుడ్‌కి చెందిన నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో మూడేళ్లుగా రిలేషన్‌లో ఉంది. ఈ ఇద్దరు ఓపెన్‌గానే ప్రేమించుకుంటున్నారు. ఓపెన్‌గానే తిరుగుతున్నారు. ఎంజాయ్‌ చేస్తున్నారు. మరి తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్తారా? లేదా అనేది చూడాలి. 
 

77

రకుల్‌ ప్రస్తుతం హిందీలో `మేరి పత్ని కా రీమేక్‌`, తమిళంలో `అయలాన్‌`, `ఇండియన్‌ 2` చిత్రాలు చేస్తుంది. ఇక జాకీ ఇప్పుడు నిర్మాతగా బిజీగా ఉన్నాడు. ఆయన `గణపత్‌` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతోపాటు `బడే మియాన్‌ చోటే మియన్‌`, `గణపత్‌ 2`, `సూర్యపుత్ర మహావీర్‌ కర్న`, `మిషన్‌ లయన్‌` చిత్రాలను నిర్మిస్తున్నారు.
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos