ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ ఏడాది దుమ్ములేపిన మొదటి తెలుగు చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). 2022లోప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లోనే రెండో స్థానంలో నిలిచింది. రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తెలుగు ఇండస్ట్రీలో మరో రికార్డు క్రియేట్ చేసింది. రెస్పాన్స్ లోనూ వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసి ఆస్కార్ బరిలో నిలిచింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఉద్యమ వీరుల పాత్రలను పోషించారు. ఈ ఏడాది మార్చి 25న పాన్ ఇండియా ఫిల్మ్ గా ఈ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.