
ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్‌గా వెలిగారు విజయశాంతి. సాధారణ నటి నుంచి, స్టార్ హీరోయిన్‌గా, ఆ తర్వాత లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగి టాలీవుడ్ చిత్ర పరిశ్రమని శాషించింది. శ్రీదే తర్వాత ఆ స్థాయి ఇమేజ్‌తో రాణించింది విజయశాంతి.
చిరంజీవి, బాలకృష్ణ, నాగ్, వెంకటేష్ వంటి సూపర్ స్టార్స్ కి దీటుగా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. వారికి పోటీగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి మెప్పించింది. స్టార్ హీరోలకు దీటుగా ఆమె సినిమాలు బాక్సాఫీసు వద్ద రచ్చ చేసేవాంటే అతిశయోక్తి కాదు.
విజయశాంతి టాలీవుడ్‌లో ఎక్కువగా బాలకృష్ణతో కలిసి నటించింది. వీరి కాంబినేషన్ లో సుమారు 17 సినిమాలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరేది. హిట్ పెయిర్‌గానూ నిలిచింది. ఈ జంట సినిమా చేస్తుందంటే హిట్ గ్యారంటీ అనే టాక్ ఉంది. మేకర్స్ అదే నమ్మేవారు. నిర్మాతలు కూడా వీరి కాంబినేషన్‌లోనే సినిమాలు చేయడానికి ఇష్టపడేవారు.
అయితే `నిప్పురవ్వ` తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాత విజయశాంతి.. బాలయ్యతో సినిమాలు తగ్గించింది. దీనికి కారణం అప్పటికే తాను లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు టర్న్ తీసుకోవడమే అని, అలా బిజీ కావడంతో బాలయ్యతో సినిమాలు చేయలేకపోయానని ఆమె చెబుతుంది. పైగా పారితోషికం కోసం తాను లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసినట్టుగా తెలిపింది.
కానీ దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి విజయశాంతి భర్త కావడం, రెండో ఈగో సమస్య కావడం. అప్పట్లో విజయశాంతికి కూడా హీరోలకు మించిన ఇమేజ్ ఉండేది. దీంతో సినిమా హిట్ అయితే ఎవరి వల్ల హిట్ అయ్యిందనే చర్చ నడిచేది.
విజయశాంతి వల్లే సినిమా హిట్ అయ్యిందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది హీరోలకు, ఆమెకి మధ్య ఈగో సమస్య తలెత్తింది. దీంతో సినిమాలు క్రమంగా తగ్గించిందని అంటుంటారు. చిరంజీవితోనూ తగ్గించడానికి ఇదే సమస్య అంటుంటారు.
కానీ బిగ్గెస్ట్ హిట్ పెయిర్‌గా ఉన్న బాలయ్యతో మూవీస్ తగ్గించడానికి మరో కారణం విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కావడమే. ఆయన బాలకృష్ణకి బంధువు. అంతేకాదు బాలయ్య తాలూకు డేట్స్ అన్నీ ఆయనే చూసుకునేవారు. దీంతో తెరవెనుక స్టోరీస్ అన్నీ వాళ్లకి తెలుసు. ఈ క్రమంలోనే విజయశాంతితో కాంబినేషన్ సెట్ కాకపోవడానికి ఆయన ఓ కారణమయ్యాడని సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు తెలిపారు.
ఆయనే కావాలని బాలకృష్ణ, విజయశాంతి పెయిర్‌ని తగ్గించారని ఆయన చెప్పారు. అదే సమయంలో బాలయ్యతో విజయశాంతికి ఈగో సమస్య వచ్చిందని, దీంతో అన్ని రకాలుగా ఇది కరెక్ట్ కాదని విజయశాంతి తగ్గించుకుందని అన్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
read more: రజినీతో 1000 కోట్ల దర్శకుడి సినిమా, హీరోయిన్ గా రష్మిక.. మరో సూపర్ స్టార్ కూడా
also read: మొన్న వినాయక్, ఇప్పుడు నాగ్ అశ్విన్.. `విశ్వంభర`లో ఏం జరుగుతుంది? చిరంజీవి భయానికి కారణమదేనా?