రామాయణ లో టాప్ స్టార్లు.. విడుదల ఎప్పుడు?
భారతీయ చిత్రసీమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న 'రామాయణ' సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, దశరథుడిగా అరుణ్ గోవిల్ కనిపించనున్నారు. వీరితో పాటు రవి దూబే, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కుణాల్ కపూర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఆస్కార్ విజేత సంస్థ డీఎన్ఈజీ, ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'రామాయణ: పార్ట్ 1' నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా, నవంబర్ 8న ఇండియాలో విడుదల కానుంది. పార్ట్ 2 ని 2027 దివాళి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.