యాంకర్ ఉదయభానును తొక్కేసింది ఎవరు? ఆమె కెరీర్ ఎందుకు నాశమైంది?

First Published | Jan 1, 2025, 12:36 PM IST

ఒకప్పుడు స్టార్ యాంకర్ గా వెలిగింది ఉదయభాను. అనూహ్యంగా ఆమె పరిశ్రమకు దూరమైంది. ఉదయభానును ఎవరైనా టార్గెట్ చేశారా? తొక్కేశారా? అనే వాదనలు ఉన్నాయి. ఉదయభానును ఒక స్టార్ సింగర్ అవమానించిందట. 
 

udayabhanu

ఉదయభాను ఒకప్పుడు బుల్లితెరను ఏలిన యాంకర్. సుమ కనకాలకు మించిన ఫేమ్ ఆమె సొంతం. ఈవెంట్ ఏదైనా ఉదయభాను తన మాటలతో జోష్ నింపేది. పదుల సంఖ్యలో టీవీ షోలు చేసింది ఉదయభాను. అనేక ఈవెంట్స్ కి హోస్ట్ గా వ్యవహరించింది. 

కాగా ఉదయభాను-సింగర్ సునీత మధ్య కోల్డ్ వార్ నడిచిందనే వాదన ఉంది. సునీత ఏర్పాటు చేసిన ఓ ఈవెంటులో ఉదయభానుకు అవమానం జరిగిందట. ఈ మేరకు సునీతను ఉద్దేశిస్తూ ఉదయభాను పరోక్ష కామెంట్స్ చేసింది. అమెరికాలో నిర్వహించిన ఈవెంట్లో సునీత అవమానించిందని ఉదయభాను అన్నారు. 


Singer Sunitha And Anchor Udayabhanu

ఉదయభాను కామెంట్స్ పై ఓ ఇంటర్వ్యూలో సునీత స్పందించారు. ఉదయభానును నేను అవమానించానని ఆమె ఫీల్ అవుతున్న విషయం నాకు అసలు తెలియదు. నాతో సరిగా మాట్లాడేది కాదు. పలకరించినా పక్కకు వెళ్లిపోయేది. తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా చేసిన కామెంట్స్ తో నాకు అర్థమైంది. నా గురించి ఆమె అలా అనుకుంటుందా అని. 

నిజానికి ఆ ఈవెంట్ కి నేను ఆమెను ఇన్వైట్ చేయలేదు. ఆర్గనైజర్స్ హోస్ట్ చేయడానికి పిలిచారు. ఆ ఈవెంట్లో ఉదయభాను వేదిక మీదకు వెళ్తుంటే నా ఆర్కెస్ట్రా నీరసంగా ఉండే ఓ ట్రాజిక్ మ్యూజిక్ కొట్టారట. దానికి ఆమె హర్ట్ అయ్యారట. అసలు నేను ఉదయభానును అవమానించడానికి, జెలస్ ఫీల్ కావడానికి కారణం ఏమి ఉంటుంది. 

ఉదయభాను తనకు తాను ఏదో ఊహించుకుని నేను అవమానించానని మాట్లాడటం మానేసింది. ఆమె ఇండైరెక్ట్ గా చేసిన కామెంట్స్ కి మీడియాలో నా పేరు వచ్చింది. అందుకే నేను రెస్పాండ్ కావాల్సి వచ్చిందని సునీత అన్నారు. మొత్తంగా ఉదయభాను-సునీత మధ్య మనస్పర్థలు తలెత్తాయని వారి కామెంట్స్ తో అర్థం అవుతుంది. అదే సమయంలో ఉదయభాను కొందరు టార్గెట్ చేశారు. కెరీర్లో తొక్కేశారనే వాదన కూడా ఉంది. వ్యక్తిగత వివాదాలు ఆమె కెరీర్ ని దెబ్బ తీశాయి.ప్రస్తుతం ఉదయభాను ఫేమ్ తగ్గింది. గతంలో మాదిరి ఆమెకు ఆఫర్స్ రావడం లేదు. ఒక దశలో ఉదయభాను హీరోయిన్ గా కూడా చిత్రాలు చేయడం విశేషం. 
 

Latest Videos

click me!